Homeఎంటర్టైన్మెంట్Son of Satyamurthy child artist: సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలోని పాప ఇంత పెద్దది...

Son of Satyamurthy child artist: సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలోని పాప ఇంత పెద్దది అయ్యిందా… ఆమె లేటెస్ట్ లుక్ చూస్తే షాక్ అవుతారు!

Son of Satyamurthy child artist: చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. చిన్నారులు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మసూద చిత్రంతో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. అనంతరం బలగం మూవీతో భారీ విజయం సొంతం చేసుకుంది. దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం ఎవరూ ఊహించని స్థాయిలో ఆదరణ పొందింది.

కావ్య కళ్యాణ్ రామ్ మాదిరి మరో చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది. ఆమె ఎవరో కాదు వర్ణిక. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంతో ఓ క్యూట్ బేబీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్ ఆఫ్ సత్యమూర్తి మంచి విజయం రాబట్టింది.

Also Read: Ramya Krishnan: రమ్యకృష్ణ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

2015లో విడుదలైన ఈ చిత్రంలో అల్లు అర్జున్-సమంత జంటగా నటించారు. లగ్జరీ లైఫ్ అనుభవించిన హీరో… తండ్రి మరణంతో ఆర్థిక కష్టాలు పడతాడు. బంగ్లా నుండి అద్దె ఇంటికి రావాల్సి వస్తుంది. ఈ సన్నివేశాల్లో ఒక పాప హీరోని మరింత వేదనకు గురి చేస్తుంది. ఆ పాప భవిష్యత్ ఏమిటని హీరో బాధపడతాడు. ఆ పాప పాత్ర చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ వర్ణిక ఇప్పుడు పెద్దదై పోయింది. త్వరలో హీరోయిన్ గా పరిచయం కానుందట.

Also Read: Shobana: ఆ హీరో మోసం చేయడం వల్లే పెళ్లి చేసుకోకుండా ఒంటరి గా ఉన్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. వర్ణిక పుష్ప 2 చిత్రంలోని ఓ సాంగ్ కి రీల్ చేసి ఇంస్టాగ్రామ్ లో పెట్టింది. వర్ణిక ను చూసి జనాలు షాక్ అవుతున్నారు. అమ్మో అప్పుడే ఇంత పెద్దమ్మాయి అయ్యిందా అని అవాక్కు అవుతున్నారు. వర్ణిక చేసిన ఇంస్టాగ్రామ్ రీల్ వైరల్ అవుతుంది. అలాగే వర్ణిక హీరోయిన్ గా సక్సెస్ కావాలని బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

Exit mobile version