బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మోనిత సహజసిద్ధంగా గర్భవతి అయింది అన్న విషయం తెలుసుకున్న కార్తీక్, సౌందర్య ఈ విషయం తెలిస్తే దీప ఎంతో మదన పడుతుంది అంటూ ఆలోచిస్తారు. ఈ విషయాన్ని దీపకి ఎలా చెప్పాలని బాధ పడుతూ ఉంటారు.ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా పిల్లలు ఇద్దరూ ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటే ఆదిత్య ఏంటి సంతోషమని అడగగా సౌర్య హిమ డాడీ పైన కోపం లేదు బాబాయ్ అని చెబుతుంది. అంతలోనే సౌందర్య, కార్తీక్ కారులో దిగుతూ ప్రసాదం తీసుకొని వస్తారు. ఎక్కడికి వెళ్లారు మమ్మీ అని ఆదిత్య అడగగా గుడికి అని చెప్పడంతో సడన్ గా గుడికి ఏంటీ మమ్మీ అనడంతో భక్తికి సమయం ఉండదని సౌందర్య చెబుతుంది.ప్రియమణి మాటలు గుర్తు చేసుకున్న దీప వెటకారంగా దర్శనం బాగా జరిగిందా అనడంతో ఆ బాగా జరిగిందని కార్తీక్, సౌందర్య పైకి వెళ్తుండగా దీప అత్తయ్య నేనేం పాపం చేశాను అని కళ్ల నిండా కన్నీళ్లు పెట్టుకుని అడుగుతుంది.
దీప ఇలా అడగడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు. నేనేం పాపం చేశానని నన్ను గుడికి తీసుకు వెళ్ళలేదు ఈసారి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళండి అంటూ మాట మార్చడంతో ఊపిరి పీల్చుకుని సరే అని చెప్పి పైకి వెళ్తారు. దీప ఇలా రిక్వెస్ట్ చేస్తూ అడగడంతో పిల్లలు నవ్వుకుంటారు. మరోవైపు మోనిత తన బాబుని చూసుకుని మురిసిపోతూ ఉండగా అంతలో భారతి వచ్చి ఏంటి ఇలా చేశావు. ఇంత మొండితనం ఎందుకు ఏ మాత్రం ఆలస్యం అయిన ప్రాణాలు పోయేవి తెలుసా అంటూ అనగా ఏం పరవాలేదు అని నవ్వుతుంది. అయినా కార్తీక్ ఇప్పుడు నిన్ను నమ్ముతాడన్న గ్యారెంటీ ఏంటి దీపను చేరదీయడానికి 11 సంవత్సరాలు పట్టిందని భారతి అనగా… ఇప్పుడైతే నా భర్తగా సంతకం చేసాడు అది చాలు నాకు రేపు నా భవిష్యత్తుకు వీడే దారి చూపిస్తాడు అంటూ చెబుతుంది. ఇక తన బారసాలకు ఏర్పాట్లు చేయాలి భారతి అంటూ తన కొడుకును చూసి మురిసి పోతుంది.
కార్తీక్ మెడపై నిలబడి తన తాను చేసిన తప్పుకి దీపను ఎలా ఎదుర్కోవాలి నిజం దీప దగ్గర చెప్పకుండా ఉండలేను,చెప్పి తనను బాధపెట్టడం లేను అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో పిల్లలు అక్కడికి వచ్చి తన మీద కోపం లేదని తనను కౌగిలించుకుని ప్రేమగా మాట్లాడుతారు. మరోవైపు ఆనందరావు ఏంటి సౌందర్య ఈమధ్య నువ్వు నాతో ఏమీ చెప్పడం లేదు నన్ను రిటైర్మెంట్ చేస్తావా అంటూ అనగా సౌందర్య మోనిత పురిటి నొప్పుల నుంచి కార్తీక్ సంతకం పెట్టిన వరకు జరిగిన విషయాన్ని చెబుతుంది. ఈ మాటలు విన్న ఆనందరావు ఒక్కసారిగా కూలబడి కార్తీక్ అసహ్యించుకుంటారు.
ఇక దీపం ఒంటరిగా కూర్చుని సౌందర్య కార్తీక్ చెప్పిన మాటలను పల్లవి, ప్రియమణి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ బాధపడుతుంది. అంతలో కార్తీక అక్కడికి వచ్చి ఏంటిది దీపా ఒంటరిగా కూర్చున్నావు అనడంతో ఎప్పటికైనా నేను ఒంటరిదాన్నే కదా డాక్టర్ బాబు అంటూ ఉంటుంది. అయినా మీరు అమెరికా ప్రయాణం ఎందుకు క్యాన్సిల్ చేశారు ఆమోనిత అని అంటూ అనగా స్టాప్ ఇట్ దీప ఎప్పుడు
మోనిత…మోనిత ఇవి తప్ప మాట్లాడుకోవడానికి మరి ఏం లేవా అంటూ కార్తీక్ కొప్పడతాడు.