Homeఎంటర్టైన్మెంట్Karthik Gattamneni: ఆయన ఇండస్ట్రీలో ఉండాలంటే ‘ఈగల్’ హిట్ కావాలా? అంత దుర్భర పరిస్థితిలో ఉన్నాడా?

Karthik Gattamneni: ఆయన ఇండస్ట్రీలో ఉండాలంటే ‘ఈగల్’ హిట్ కావాలా? అంత దుర్భర పరిస్థితిలో ఉన్నాడా?

ఈగల్ సినిమా మీదనే పూర్తి ఆశలు పెట్టుకున్నారు కార్తీక్. ఎందుకంటే ఈయన ఇంతకు ముందు తెరకెక్కించిన సూర్య వర్సెస్ సూర్య సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.

Karthik Gattamneni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో.. డైరెక్టర్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు హీరోహీరోయిన్ లకు మాత్రమే ఫ్యాన్స్ ఉండేవారు. కానీ ప్రస్తుతం డైరెక్టర్లకు కూడా పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులు ఉంటున్నారు. ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీలో అభిమానులను సంపాదించిన డైరెక్టర్లు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం ఈగల్ సినిమాతో కార్తీక్ ఘట్టమనేని కూడా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకునే పనిలో పడ్డారు. ఈ సినిమాలో రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈగల్ సినిమా మీదనే పూర్తి ఆశలు పెట్టుకున్నారు కార్తీక్. ఎందుకంటే ఈయన ఇంతకు ముందు తెరకెక్కించిన సూర్య వర్సెస్ సూర్య సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. దీంతో ఈగల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితేనే మరొక సినిమా ఛాన్స్ వస్తుంది. లేదంటే ఇతర హీరోలు ఈయనకు ఆఫర్ ఇవ్వడానికి భయపడే అవకాశమే ఎక్కువ. ఇదే జరిగితే డిఓపిగా కంటిన్యూ అవ్వాల్సిందే కార్తీక్. అందుకే ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారట డైరెక్టర్. అయితే ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ వల్ల కచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.

ఈ సినిమాలో రవితేజ నటిస్తున్నారు కాబట్టి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మరోవైపు మాస్ మహారాజాకు కూడా ఈ మధ్య కొన్ని ఫ్లాప్ లు ఉన్నాయి. దీంతో ఈ సినిమా హిట్ అయితే రవితేజ సినిమా లైఫ్ మరింత బాగుంటుంది. అంటే ఈ ఒక్క సినిమాతో డైరెక్టర్, రవితేజ లైఫ్ లు మారనున్నాయి. కానీ రవితేజ కంటే డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనికి ఈ సినిమా చాలా కీలకంగా మారనుంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే డైరెక్టర్ కు మంచి గుర్తింపు వస్తుంది. ఇక ట్రైలర్ చూస్తే ఈ సినిమా మేకింగ్ చాలా బాగా డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఫుల్ సినిమా చూస్తే గానీ ఏది చెప్పలేం. సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మరి ప్రేక్షకులను అలరించడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూడాలి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper