Puneeth Rajkumar: ఇటీవల ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ మృతి చెందిన సగంతి తెలిసిందే. అయితే బెంగళూరు నగరంలోని మైసూరు రోడ్డులోని నాయండహళ్లి జంక్షన్ నుంచి వెగాసిటీ మాల్ వరకు ఉన్న రహదారికి పవర్‌స్టార్ పునీత్‌రాజ్‌కుమార్ పేరు పెట్టనున్నారు. ఈనెల 30న ఈ రహదారికి పేరు పెట్టే కార్యక్రమానికి ముహూర్త ఖరారైంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో పాటు రాజ్‌కుమార్ కుటుంబసభ్యులంతా పాల్గొనబోతున్నారు.
కన్నడ సూపర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్ మార్చి 17న విడుదలవుతుంది. పునీత్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. పైగా ఈ సినిమా తో అన్నీ రికార్డ్స్ బ్రేక్ అయ్యేలా పునీత్ ఫ్యాన్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ముఖ్యంగా తమ దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
Also Read: పవన్ టార్గెట్ ఫిక్స్.. ఇక తేల్చుకోవాల్సింది చంద్రబాబే..!
కాగా ‘జేమ్స్’ నుంచి విడుదలైన ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంటుండగా.. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ పునీత్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘సూపర్ టీజర్. పునీత్ ఎప్పటికీ కింగ్. బిగ్ స్క్రీన్ పై అప్పు సార్ ను చూసేందుకు వెయిటింగ్. చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్’ అని ప్రశాంత్ చెప్పాడు. కాగా చేతన్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 17న రిలీజ్ కానుంది.
ఇక పునీత్ రాజ్ కుమార్ పై ప్రశాంత్ నీల్ ప్రశంసలు కురిపించినట్లుగానే మిగిలిన హీరోలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫ్యాన్స్ అయితే.. ఇప్పటి నుంచే పునీత్ చిత్ర పటాలను రెడీ చేస్తున్నారు. ఇక పునీత్ పేరట ఓ గుడిని కూడా కట్టబోతున్నారని తెలుస్తోంది.
Also Read: వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చను.. పొత్తులపై పవన్ సంచలన ప్రకటన