https://oktelugu.com/

Chanakya Niti: భర్తలు భార్యలకు చెప్పకూడని విషయాలు ఏమిటో తెలుసా?

Chanakya Niti: ఆచార్య చాణిక్య నీతి గ్రంథంలో ఎన్నో అద్భుతమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మానవుల ప్రవర్తన గురించి ఈ గ్రంథంలో ఎంతో అద్భుతంగా వివరించారు. ముఖ్యంగా మనిషి ఎలా ప్రవర్తించాలి ఎప్పుడు ఏ విధంగా ఉండాలి ఆయా సందర్భాలను బట్టి చాణిక్యుడు ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ క్రమంలోనే చాణిక్య నీతి గ్రంథంలో భర్త భార్యకు కొన్ని ఈ విషయాలు చక్కగా వివరించారు. మరి ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం… ఆదాయం: భర్త ఎప్పుడూ కూడా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 15, 2022 12:58 pm
    Follow us on

    Chanakya Niti: ఆచార్య చాణిక్య నీతి గ్రంథంలో ఎన్నో అద్భుతమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా మానవుల ప్రవర్తన గురించి ఈ గ్రంథంలో ఎంతో అద్భుతంగా వివరించారు. ముఖ్యంగా మనిషి ఎలా ప్రవర్తించాలి ఎప్పుడు ఏ విధంగా ఉండాలి ఆయా సందర్భాలను బట్టి చాణిక్యుడు ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ క్రమంలోనే చాణిక్య నీతి గ్రంథంలో భర్త భార్యకు కొన్ని ఈ విషయాలు చక్కగా వివరించారు. మరి ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం…

    Chanakya Niti

    Chanakya Niti

    ఆదాయం: భర్త ఎప్పుడూ కూడా తను ఎంత సంపాదిస్తున్నారు, తన ఆదాయం ఎంత అనే విషయం ఎప్పుడూ కూడా భార్యకి చెప్పకూడదని చాణిక్య నీతి గ్రంథంలో తెలియజేశారు.ఇలా భర్త ఆదాయం భార్యకు తెలిసినప్పుడు ఇంట్లో అనవసర ఖర్చులు పెరుగుతాయి కనుక భర్త ఆదాయం ఎప్పుడు భార్యకు తెలియకూడదు.

    Also Read: Amavaasya: నేడే శనీఅమావాస్య ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఇలా చేయాల్సిందే!

    బలహీనత: భర్త బలహీనతలు భార్యకు తెలియకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ భర్త బలహీనత భార్యకు తెలిస్తే ఆ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తుంది. ఈ బలహీనత నుంచి బయట పడాలని భర్త ప్రయత్నించిన భార్య అడ్డు పడుతుంది. కనుక భర్త బలహీనత గురించి భార్యకు తెలియకూడదు.

    పొందిన అవమానం: సాధారణంగా భర్త ఎక్కడైనా ఇతరులతో అవమానం పొందితే ఆ విషయాన్ని తనలోనే ఉంచుకోవాలి.ఆ బాధను పంచుకోవాలని భార్యకు తను పొందిన అవమానం గురించి ప్రస్తావిస్తే ఇంట్లో భర్త గురించి చులకన భావన ఏర్పడి పదే పదే ఆ అవమానాన్ని గుర్తు చేస్తుంటారు. బయటపడిన అవమానం కన్నా ప్రతిరోజూ ఆ ప్రస్తావన ఇంట్లో తీసుకురావటం వల్ల మరింత అవమానానికి గురి అవుతారు కనుక బయట పొందిన అవమానాన్ని భార్యకు చెప్పకండి.

    Also Read: Peanuts Side Effects: ఈ సమస్యతో బాధపడే వారు వేరుశనగకు దూరంగా ఉండాల్సిందే…?

    చేయాలనుకున్న సహాయం: మీకు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే అది భార్యకు తెలియకుండా సహాయం చేయమని చెప్పారు చాణిక్యుడు. మీకు సహాయం చేయాలని ఉన్నా ఆ విషయం భార్యకు తెలిస్తే చేసే సహాయానికి అడ్డు పడ్డారు.అలాగే మీరు సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు తన భర్త సహాయం చేస్తారని మాట ఇవ్వడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయి కనుక చేయాలనుకున్న సహాయాన్ని భార్యలకు చెప్పకూడదని చాణిక్యనీతి గ్రంథం తెలియజేస్తుంది.

    భర్తలు భార్యలకు చెప్పకూడని విషయాలు.. | Wife and Husband Relationship | Chanakya Niti