https://oktelugu.com/

నన్ను తన ఫ్రెండ్స్ తో పడుకోమన్నాడు – కరిష్మా కపూర్

హిందీ చిత్ర పరిశ్రమలో ‘కపూర్ ఫ్యామిలీ’ నుండి అనేక మంది గొప్ప నటులు వెండితెర మీద స్టార్స్ గా ఎదిగారు. ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన “కరిష్మా కపూర్” హీరోయిన్ గా 1990-2010 మధ్య కాలంలో బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. దేశం మొత్తం ఆమె అందానికి ఫిదా అయిపోయింది. 1991లో ప్రేమ ఖైదీ మూవీ ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కూలీ నెం 1, రాజా హిందుస్తానీ, దిల్ తోహ్ పాగల్ హై, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 30, 2020 / 05:54 PM IST
    Follow us on


    హిందీ చిత్ర పరిశ్రమలో ‘కపూర్ ఫ్యామిలీ’ నుండి అనేక మంది గొప్ప నటులు వెండితెర మీద స్టార్స్ గా ఎదిగారు. ఆ ఫ్యామిలీ నుండి వచ్చిన “కరిష్మా కపూర్” హీరోయిన్ గా 1990-2010 మధ్య కాలంలో బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. దేశం మొత్తం ఆమె అందానికి ఫిదా అయిపోయింది. 1991లో ప్రేమ ఖైదీ మూవీ ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత కూలీ నెం 1, రాజా హిందుస్తానీ, దిల్ తోహ్ పాగల్ హై, ఫిజా వంటి అనేక విజయాలను అందుకుంది.అత్యంత విజయవంతమైన కథానాయికగా బాలీవుడ్ లో ఆమెకి మంచి గుర్తింపు ఉంది. అయితే, ఆమె తన వృత్తి జీవితంలో అందుకున్న విజయాలను, ఆమె వ్యక్తిగత జీవితంలో పొందలేకపోయింది.

    Also Read: కలియుగ కర్ణుడు ‘సోనూసూద్’కి విగ్రహం ఏర్పాటు !

    కరిష్మా 2003 లో సంజయ్ కపూర్ ని వివాహం చేసుకుని సినిమా ఇండస్ట్రీకి నుండి తప్పుకుంది. అయితే అనేక ఒడిదుడుకులతో సాగిన ఆమె వివాహ జీవితం 2016 లో తెరపడింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కరిష్మా తన వ్యక్తిగత జీవితం గురించి పలు సంచలన విషయాలని పంచుకున్నారు. వివాహం తరువాత తన జీవితం పూర్తిగా మారిందని, ప్రతి రోజు ఆమె ఆ వివాహ జీవితంలో బాధపడినట్లుగా వెల్లడించారు. హనీమూన్ సమయంలో సంజయ్ కపూర్ కరిష్మాను తన స్నేహితులతో కలిసి పడుకోమని బలవంతం చేశాడని ఆమె నిరాకరించటంతో, దారుణంగా కొట్టినట్లుగా పేర్కొన్నారు.

    Also Read: గూగుల్ ‌లో అత్యధికంగా వెతికింది వీరినే !

    కరిష్మాతో వివాహం తరువాత కూడా సంజయ్ తన మొదటి భార్యతో శారీరక సంబంధంలో ఉన్నారని వెల్లడించారు. ఆమె ఈ విషయం తెలుసుకుని, సంజయ్‌ను ప్రశ్నించగా, అతను తన తప్పును అంగీకరించకుండా ఆమెపై దాడి చేయడం ప్రారంభించాడట.
    ఆమె భర్త మాత్రమే కాకుండా, అత్తగారు కూడా చాలాసార్లు దాడి చేశారని,మార్పు వస్తుందేమో అని చాలా కాలం ఎదురు చూశానని, అయినా ఎటువంటి ప్రయోజనం లేనందువలన ఆ బాధలని భరించలేక చివరికి విడాకులు తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్