కరోనా వ్యాక్సిన్ తీసుకునే వారికి షాకింగ్ న్యూస్..?

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. పలు రాష్ట్రాల్లో 500 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకుంటే కొత్తరకం కరోనా బారిన పడమని ప్రజలు భావిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకుతుండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. Also Read: కరోనా కొత్త స్ట్రెయిన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..! పూర్తి వివరాల్లోకి […]

Written By: Kusuma Aggunna, Updated On : December 31, 2020 12:52 pm
Follow us on


దేశంలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. పలు రాష్ట్రాల్లో 500 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకుంటే కొత్తరకం కరోనా బారిన పడమని ప్రజలు భావిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా సోకుతుండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది.

Also Read: కరోనా కొత్త స్ట్రెయిన్ పై ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాలోని క్యాలిఫోర్నియా కు చెందిన మాథ్యూస్ అనే నర్సు కరోనా బారిన పడకుండా ఉండాలనే ఆలోచనతో ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న ఏడు రోజుల తరువాత ఆమె కరోనా బారిన పడ్డారు. మాథ్యూస్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన మాథ్యూస్ కరోనా తొలి డోస్ ను తీసుకున్నారు.

Also Read: దేశంలో కలకలం సృష్టిస్తున్న కొత్త కరోనా.. పెరుగుతున్న కేసులు..!

క్రిస్మస్ పండగ రోజున మాథ్యూస్ విధులు నిర్వహిస్తున్న సమయంలో తనలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. ఆమె వెంటనే కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా నిర్ధారణ కావడంతో వ్యాక్సిన్ పనితీరుపై సందేహాలు కలుగుతున్నాయి. అయితే శాస్త్రవేత్తలు మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తరువాతే శరీరానికి ఇమ్యూనిటీ వస్తుందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

కరోనాన్ వ్యాక్సిన్ తొలి డోస్ ద్వారా 50 శాతం వైరస్ ను ఎదుర్కొనే సామర్థ్యం వస్తుందని మలి డోసు ద్వారా 95 శాతం శక్తి వస్తుందని వ్యాక్సిన్ తీసుకున్నా కొన్నిరోజుల పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా పూర్తిస్థాయిలో ఇమ్యూనిటీ రాకపోతే వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది.