https://oktelugu.com/

Actress Hema: ఆ జబర్దస్త్ లేడీ కమెడియన్ పై నటి హేమ కుట్ర… షాకింగ్ మేటర్ లీక్ చేసిన కరాటే కళ్యాణి!

Actress Hema: హేమ ఈ వార్తలను ఖండించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఓ వీడియో విడుదల చేసింది. హేమ అబద్దం చెప్పారు. ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నారట.

Written By:
  • S Reddy
  • , Updated On : May 27, 2024 / 01:01 PM IST

    Karate Kalyani Sensational Comments on Actress Hema

    Follow us on

    Actress Hema: నటి హేమ పై కరాటే కళ్యాణి(Karate Kalyani) చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. జబర్దస్త్ వర్షను(Jabardasth Varsha) హేమ అమ్మి వేయాలని చూసిందని కరాటే కళ్యాణి సీరియస్ అయ్యారు. విషయంలోకి వెళితే… నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగుళూరులో మే 19న ఓ ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ(Rave Party) జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నటి హేమ సైతం రేవ్ పార్టీలో పాల్గొన్నారని తెలుస్తుంది. ఆమె ఫోటోను పోలీసులు విడుదల చేశారు.

    అయితే హేమ ఈ వార్తలను ఖండించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఓ వీడియో విడుదల చేసింది. హేమ అబద్దం చెప్పారు. ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నారట. విచారణకు హాజరు కావాలని పోలీసులు హేమకు నోటీసులు పంపినట్లు వినికిడి. కాగా హేమ మీద ఫైర్ అయ్యారు కరాటే కళ్యాణి. ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. హేమ వాట్సప్ గ్రూప్స్ లో అమ్మాయిల ఫోటోలు షేర్ చేస్తుంది. ఆమె వద్ద కొందరు అమ్మాయిలు ఉన్నారు.

    జబర్దస్త్ వర్షను హేమ వేరొకరికి అమ్మి వేయాలని చూసింది. ఆమె ఫోటో ఒకసారి మా వాట్సప్ గ్రూప్ లో పెట్టింది. ఆ ఫోటోను వెంటనే డిలీట్ చేసింది. పొరపాటున వర్ష ఫోటో పోస్ట్ చేశానని హేమ చెప్పింది. హేమ జబర్దస్త్ వర్ష జీవితం నాశనం చేయాలని చూసింది అన్నారు. హేమ మంచి వ్యక్తి కాదని కరాటే కళ్యాణి అన్నారు.

    మరోవైపు హేమకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మద్దతుగా నిలిచాడు. ఆమె నేరం చేసినట్లు రుజువు అయ్యేవరకు వేచి చూడాలి. నేరం రుజువు కాకుండా టార్గెట్ చేయడం సరికాదు. హేమకు కుటుంబం ఉంది. రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ ఆరోపణలు చేయడం వలన ఆమె గౌరవానికి భంగం కలుగుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రోత్సహించదు. ఒక వేళ హేమ తప్పు చేసినట్లు నిరూపితం అయితే, అప్పుడు చర్యలు తీసుకుంటాము. అంత వరకు రాద్ధాంతం చేయకండని, మంచు విష్ణు కామెంట్ చేశాడు.

    Actress Hema : నటి హేమ విషయంలో మంచు విష్ణు సంచలన ప్రకటన

    Actress Hema: సైలెంట్ గా డైరెక్టర్ కొడుకుని లైన్లో పెట్టిన నటి హేమ… ఆమె లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులో!