Actress Hema : నటి హేమ విషయంలో మంచు విష్ణు సంచలన ప్రకటన

హేమ తప్పు చేశారని పోలీసులు నిర్ధారిస్తే, ఆమెపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అప్పుడు ఆలోచిస్తాము. అప్పటి వరకు హేమ విషయాన్ని రాద్ధాంతం చేయకండి.. అని మంచు విష్ణు ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

Written By: NARESH, Updated On : May 25, 2024 9:01 pm

Actress Hema

Follow us on

Actress Hema : గత వారం రోజులుగా నటి హేమ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఆదివారం మే 19న బెంగుళూరులోని ఓ ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. ఓ ప్రముఖ వ్యక్తి బర్త్ డే పార్టీలో భాగంగా ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. బడా బాబులు పాల్గొన్న ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు లభించాయి. దాదాపు 100 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 70 మంది అబ్బాయిలు 30 మంది అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం.

టాలీవుడ్ నటి హేమ ఈ ఇల్లీగల్ పార్టీకి హాజరైనట్లు బెంగుళూరు పోలీసులు ధ్రువీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె ఫోటోను పోలీసులు విడుదల చేశారని సమాచారం. రేవ్ పార్టీకి హాజరైనట్లు వార్తలు వచ్చిన వెంటనే హేమ స్పందించారు. నేను ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఫార్మ్ హౌస్లో ఉన్నాను. ఇక్కడ చిల్ అవుతున్నాను. నేను బెంగుళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ నిరాధార ఆరోపణలు. ఎవరూ నమ్మకండి అని వీడియో విడుదల చేశారు.

కృష్ణవేణి అనే పేరుతో నటి హేమ ఈ పార్టీలో పాల్గొన్నారని, ఆమె బ్లడ్ శాంపిల్స్ రిజల్ట్ కూడా పాజిటివ్ గా వచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి. హేమ మాత్రం తాను డ్రగ్ పార్టీకి హాజరైనట్లు ఒప్పుకోవడం లేదు. సోషల్ మీడియాలో రోజులో వీడియో విడుదల చేస్తుంది. ఆమె వరుసగా వంటల వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. కొందరేమో హేమ పోలీసుల అదుపులోనే ఉన్నారని అంటున్నారు. ఈ హైడ్రామా మధ్య మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించాడు.

నటి హేమకు ఆయన మద్దతుగా నిలిచాడు. కేవలం పుకార్ల ఆధారంగా నటి హేమ మీద దుష్ప్రచారం చేయకండి. ఆమెకు ఫ్యామిలీ ఉంది. నిజానిజాలు తెలియకుండా సోషల్ మీడియాలో ఆమెపై తప్పుడు ప్రచారం చేయడం గౌరవానికి భంగం కలిగిస్తుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించదు. హేమ తప్పు చేశారని పోలీసులు నిర్ధారిస్తే, ఆమెపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అప్పుడు ఆలోచిస్తాము. అప్పటి వరకు హేమ విషయాన్ని రాద్ధాంతం చేయకండి.. అని మంచు విష్ణు ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.