Kalki Movie: రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్(Prabhas) ఈ సినిమాతోనే తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఆయన వరసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఎవరికి సాధ్యం కానీ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇలాంటి తరుణంలో ఆయన చేస్తున్న చాలా సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.
మరి దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాలు బాగుండి మంచి రికార్డులను క్రియేట్ చేయాలని ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే జూన్ 27వ తేదీన కల్కి సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా కోసమే ప్రభాస్ అభిమానులందరూ కూడా చాలావరకు వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ముందు కొన్ని టార్గెట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇంతకుముందు ప్రభాస్ క్రియేట్ చేసిన రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్ల వరకు బడ్జెట్ అయితే పెట్టారు.
మరి ఆ బడ్జెట్ ని రికవరీ చేసి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ని లాభాల బాట పట్టే విధంగా చేస్తుందా లేదా అనే విషయాల మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఎప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం కల్కి సినిమా మీద పాన్ ఇండియాలో మంచి అంచనాలైతే ఉన్నాయి.
కాబట్టి ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టి ప్రభాస్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలుస్తుంది అంటూ సినిమా యూనిట్ అయితే చెబుతుంది. ఇక ఈ సినిమాలోబాలీవుడ్ దిగ్గజ నటుడు అయిన అమితాబచ్చన్(Amitabh Bachchan) కూడా నటించడం విశేషం అనే చెప్పాలి…ఇక అమితాబ్ తో పాటు కమలహాసన్(Kamal Haasan) కూడా విలన్ గా నటిస్తున్నాడు.. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…
Kalki 2898 AD: కల్కి సినిమాలో ‘ బుజ్జి’ వాహనం తో అదరగొట్టిన ప్రభాస్…