https://oktelugu.com/

Actress Hema: సైలెంట్ గా డైరెక్టర్ కొడుకుని లైన్లో పెట్టిన నటి హేమ… ఆమె లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులో!

హేమ అసలు పేరు కృష్ణవేణి. ఆమె తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందినవారు. నటనపై ఆసక్తి ఉండటంతో పరిశ్రమలో అడుగు పెట్టింది. 1989లో ' భలేదొంగ ' సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయింది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 25, 2024 2:57 pm
    Actress Hema Love Story

    Actress Hema Love Story

    Follow us on

    Actress Hema: నటి హేమ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఆమె బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్నారని పోలీసులు ప్రకటన విడుదల చేయడంతో హేమ హాట్ టాపిక్ గా మారింది. అయితే హేమ తాను పార్టీలో లేను అంటూ వీడియో రిలీజ్ చేసింది. కానీ పోలీసులు ఆధారాలతో సహా నిరూపించడంతో అడ్డంగా బుక్కైపోయింది. అతిపెద్ద వివాదంలో ఇరుక్కున్న హేమ వివరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కాగా హేమకు ఒక క్రేజీ లవ్ స్టోరీ ఉంది. ఆమె ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె లవ్ స్టోరీ లో చాలా ట్విస్టులు ఉన్నాయి.

    హేమ అసలు పేరు కృష్ణవేణి. ఆమె తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందినవారు. నటనపై ఆసక్తి ఉండటంతో పరిశ్రమలో అడుగు పెట్టింది. 1989లో ‘ భలేదొంగ ‘ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హేమ వందల సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె సూపర్ సక్సెస్.

    కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో హేమ తన లవ్ స్టోరీ బయటపెట్టింది. తన భర్త గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. ఆమె దూరదర్శన్ లో పని చేస్తున్నప్పుడు అతను పరిచయం అయ్యాడట. అక్కడే అసిస్టెంట్ కెమెరా మ్యాన్ గా పని చేసేవారట. అయితే ఒక రోజు హేమను కలిసిన ఫస్ట్ మీటింగ్ లోనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడట. కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పసరికి మోసం చేసే క్యారెక్టర్ కాదని భావించి హేమ ఓకే చెప్పిందట.

    ఇక ఇంట్లో తెలియకుండా సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారట. మొదట్లో కుటుంబ ఒప్పుకోలేదట. హేమ తల్లి ఆమెపై కోప్పడ్డారట. కానీ కొద్ది రోజుల తర్వాత ఇరు కుటుంబాల సమ్మతితో రిసెప్షన్ ఏర్పాటు చేశారని, అలా పెళ్లి జరిగిందంటూ గతంలో హేమ చెప్పుకొచ్చింది. కాగా వీరికి ఒక కూతురు ఉంది. సయ్యద్ జాన్ అహ్మద్ తండ్రి ఓ దర్శకుడు కావడం విశేషం. ఆయన పేరు ఎస్డీ లాల్. అన్నదమ్ముల అనుబంధం, నకిలీ మనిషి వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.