Prabhas: ప్రస్తుతం పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ఏకైక హీరో ప్రభాస్… ఈయనను బీట్ చేసే హీరో ఇండియాలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక బాలీవుడ్ హీరోలకు సైతం చెమటలు పట్టిస్తున్న ఏకైక తెలుగు హీరో కూడా ప్రభాస్ గారే కావడం విశేషం… తక్కువ సమయం లోనే పాన్ ఇండియా సినిమాలు చేసి భారీ సక్సెస్ లను అందుకుంటున్న ప్రభాస్ తన దైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు హను రాఘవ పూడి డైరెక్షన్ లో ఒక యుద్ధ నేపథ్యంలో సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి ‘ఫాజీ ‘ అనే వర్కింగ్ టైటిల్ ను కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది.
ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. ఇక తొందర్లోనే రెగ్యూలర్ షూటింగ్ కి కూడా వెళ్లబోతున్నట్టుగా కూడా వార్త లైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి కావాల్సిన స్టార్ కాస్టింగ్ మొత్తాన్ని ఎంపిక చేస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాతో ఎలాగైనా సరే ఒక భారీ సక్సెస్ ని అందుకొని పాన్ ఇండియాలో తను స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇంతకుముందు ఆయన చేసిన ‘సీతా రామం’ సినిమా ప్రేక్షకులను ఆకరించడమే కాకుండా దర్శకుడిగా తనకు ఒక సెపరేట్ గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి ఇలాంటి సమయంలో ఆయన ఎలాంటి రిస్క్ చేయకుండా ప్రభాస్ తో మళ్లీ యుద్ధ వాతావరణంలోనే ఒక సినిమాను చేసి సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర ని తీసుకోవాలని హను రాఘవపూడి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే ఉపేంద్ర రజినీకాంత్ హీరోగా లోకేష్ కనక రాజ్ డైరెక్షన్ లో వస్తున్న ‘కూలీ ‘ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇక ప్రభాస్ తో సినిమా అనగానే ఉపేంద్ర కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆయన పాజిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడా? లేదంటే నెగిటివ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే లావ్ స్టోరీలను తెరకెక్కించే హను రాఘవ పూడి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…