https://oktelugu.com/

Ram Charan: బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లలో రామ్ చరణ్ కి నచ్చిన ముగ్గురు హీరోలు వీళ్లే…

సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ లు ఉంటేనే ఎవరికైనా క్రేజ్ ఉంటుంది. లేకపోతే మాత్రం ఇక్కడ ఎవరిని ఎవరు పట్టించుకోరు... అందుకే సక్సెస్ అనేది చాలా ముఖ్యం...

Written By:
  • Gopi
  • , Updated On : September 5, 2024 / 10:18 AM IST

    Ram Charan(1)

    Follow us on

    Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న హీరో రామ్ చరణ్… ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా కోసం తను తీవ్రమైన కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మీదనే ఆయన పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ తన అభిమాన హీరోల గురించి తెలియజేశాడు. ముఖ్యంగా ఆయనకి కోలీవుడ్ లో ఉన్న స్టార్ హీరో అయిన సూర్య అంటే చాలా ఇష్టమట.

    ఈ జనరేషన్ లో ఉన్న హీరోల్లో సూర్య ఎలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుడు కావడం వల్లే అతనంటే రామ్ చరణ్ కి చాలా ఇష్టమని తెలియజేశాడు. ఇక అదే విధంగా బాలీవుడ్ లో షారుక్ ఖాన్ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. షారుక్ ఖాన్ సినిమాలు అంటే అమితమైన ఇష్టం ఉండటమే కాకుండా వాటిని చూడడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండేవాడట. సినిమాల వల్లే షారుక్ ఖాన్ అంటే అతనికి అమితమైన ఇష్టం ఏర్పడిందని చెప్పాడు.

    ఇక ఇది ఇలా ఉంటే తెలుగులో మాత్రం వాళ్ళ నాన్న చిరంజీవి అంటే అతనికి అమితమైన ఇష్టమని చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసుకుంటూ పెరగడం, అతను చెప్పిన సలహాలతోనే ముందుకు సాగాడని దాని వల్లే ఆయన ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నానని చెప్పడం విశేషం… ఇక మొత్తానికైతే రామ్ చరణ్ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో తనకు నచ్చిన హీరోలు ఎవరో చెప్పడం విశేషం… ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా గేమ్ చేంజర్ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని సాధించి దాదాపు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టాలని చూస్తున్నాడు.

    ఇక తను అనుకున్నట్టుగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ సక్సెస్ ని సాధించి రామ్ చరణ్ మరోసారి బాలీవుడ్ బాద్షాగా నిలబడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇతని తోటి హీరోలు అయిన ప్రభాస్, అల్లు అర్జున్ బాలీవుడ్ లో భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తున్న సమయంలో రామ్ చరణ్ కూడా ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం రాజమౌళి నే తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకుంటేనే బాలీవుడ్ లో ఆయనకు మార్కెట్ అనేది మరింత పెరుగుతుంది. లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుందనే చెప్పాలి…