Gabbar Singh Re Release: ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..పని దినాల్లో కూడా తగ్గని జోరు!

ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ముందు ఉన్నటువంటి రికార్డ్స్ ని డబుల్ మార్జిన్ తో దాటేసిన 'గబ్బర్ సింగ్' చిత్రం రెండవ రోజు వీకెండ్ కానప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టి ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేసింది.

Written By: Vicky, Updated On : September 5, 2024 10:08 am

Gabbar Singh' re-release

Follow us on

Gabbar Singh Re Release: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా సెప్టెంబర్ 2 వ తారీఖున విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రీ రిలీజ్ కి ముందే ఎన్నోసార్లు గబ్బర్ సింగ్ చిత్రాన్ని అభిమానులు ప్రదర్శించారు. అయినప్పటికీ కూడా ఈ రేంజ్ లో చూశారంటే అది పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ కి ఉదాహరణ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది ఇండియా లోనే ఆల్ టైం రికార్డు గా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. వాస్తవానికి 8 కోట్ల రూపాయిల గ్రాస్ కంటే ఎక్కువ వసూళ్లే వచ్చాయి. కానీ బయ్యర్స్ మధ్య ఉన్న కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వచ్చిన దానికంటే తక్కువ వసూళ్లను బయటకి వదిలారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ముందు ఉన్నటువంటి రికార్డ్స్ ని డబుల్ మార్జిన్ తో దాటేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం రెండవ రోజు వీకెండ్ కానప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టి ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజు 68 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. పని దినంలో ఒక రీ రిలీజ్ చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది చిన్న విషయం కాదు. అలా రెండు రోజులు 8 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మూడవ రోజు 30 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి 9 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం సెన్సేషనల్ రికార్డుని నెలకొల్పింది.

ఈ చిత్రం సరైన సమయంలో విడుదల కాలేదని, రాష్ట్రంలో ఎక్కడ చూసిన వర్షాలు, వరదలు ఉన్న సమయంలో విడుదలైందని, సోమవారం కాకుండా వీకెండ్ లో విడుదల అయ్యుంటే ఈ చిత్రం ఫుల్ రన్ లో 15 నుండి 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న మాట. ఈరోజు కొత్త సినిమా విడుదలైనప్పటికీ కూడా ‘గబ్బర్ సింగ్’ చిత్రం డీసెంట్ షోస్ సంఖ్య తో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ రీ రిలీజ్ చిత్రానికే ఈ స్థాయి రెస్పాన్స్ వస్తే, మార్చి నెలలో విడుదలయ్యే ‘ఓజీ’ చిత్రానికి ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందో అని అభిమానులు ఊహించుకుంటూ సోషల్ మీడియా లో మురిసిపోతున్నారు. ఈ నెల నుండే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ మొదలు కానుంది.