https://oktelugu.com/

Kamal Haasan : ఈ ఏజ్ లో కూడా కమలహాసన్ సినిమా లైనప్ చూస్తే ఆశ్చర్యపోతారు..?

Kamal Haasan ఇక ఇప్పుడు ఏజ్ కి తగ్గ పాత్రలు ఎంచుకుంటూ తను నటుడిగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంటున్నాడు...

Written By:
  • NARESH
  • , Updated On : June 13, 2024 / 11:36 PM IST

    Kamal Haasan Movies

    Follow us on

    Kamal Haasan : ప్రస్తుతం లోకనాయకుడు అయిన కమలహాసన్ కి 69 సంవత్సరాలు ఉన్నప్పటికీ తను సినిమాల విషయంలో మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇక యూత్ లో ఉన్న హీరోలందరికి పోటీని ఇస్తూ తను ముందుకు సాగుతున్నాడు. నిజానికి ఆయన ఏజ్ కి తగ్గ పాత్రలను చేస్తూ ఆయన సినిమాలు చేయడం అనేది ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

    ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన కల్కి సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాలో కమలహాసన్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు అంటూ సినిమా మేకర్స్ అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఆయన శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న భారతీయుడు 2 అనే సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.

    ఇక ఈ సినిమా తర్వాత మణిరత్నం దర్శకత్వం లో ‘తుగ్ లైఫ్’ పేరుతో ఇంకో సినిమా కూడా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో కూడా తన ఏజ్ కి తగ్గ పాత్రను ఎంచుకోవడం విశేషం…ఇక ఈ సినిమానే కాకుండా ఇంతకుముందు లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో కమలహాసన్ చేసిన విక్రమ్ సినిమాలో కూడా ఆయన 50 సంవత్సరాల పైబడ్డ వ్యక్తి పాత్రను పోషించడమే కాకుండా ఆ సినిమాను సూపర్ సక్సెస్ చేయడంలో కీలకపాత్ర వహించాడు.

    ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజు కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తొందర్లోనే వీళ్ళ కాంబినేషన్ లో విక్రమ్ 2 సినిమా కూడా సెట్స్ మీదకి రాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక లోకేష్ కనకరాజు కూడా గతంలో ఈ సినిమా గురించి చాలాసార్లు డిస్కస్ చేశాడు. ఇక కమలహాసన్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో ఆర్ట్ సినిమాలను చేసి సూపర్ హిట్స్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఏజ్ కి తగ్గ పాత్రలు ఎంచుకుంటూ తను నటుడిగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంటున్నాడు…