Hollywood : హాలీవుడ్ లో ఈ ఇద్దరి డైరెక్టర్స్ సినిమాలు చూస్తే చాలు.. ఇంకేవి చూడాల్సిన పనిలేదు…

Hollywood ఇక వీళ్లకు సంబంధించిన సినిమాలు ఏవైనా మీరు ఇప్పటికి చూడకపోయి ఉంటే చూసేయండి పక్కాగా మిమ్మల్ని రెండు గంటల పాటు ఎంటర్ టైన్ చేస్తాయి...

Written By: NARESH, Updated On : June 13, 2024 11:30 pm

Christopher Nolan and David Fincher movies are very good in Hollywood

Follow us on

Hollywood : హాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో క్రిష్టోఫర్ నోలన్, డెవిడ్ ఫించర్ లాంటి దర్శకులు వాళ్ల సినిమాలతో ప్రపంచం మొత్తం హాలీవుడ్ సినిమాల వైపు చూసేలా చేశారు. ఇక నిజానికి మిగతా దర్శకులందరూ కూడా వాళ్ళకు నచ్చిన జానర్స్ లో సినిమాలను చేసి సక్సెస్ లను అందుకున్నారు. కానీ వీళ్ళు మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చేయడంలో సిద్ధహస్తులనే చెప్పాలి.

ఇక ముఖ్యంగా ఈ సినిమా గురించి ఆయన ఇప్పటికే ద డార్క్ నైట్ సిరీస్, ఇన్సెప్షన్, మెమోంటో, టెనెట్ లాంటి ఎన్నో గొప్ప సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఈయన స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా రాస్తాడు అంటూ ఆయనకు ఒక మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక మొత్తానికైతే ఈయన తీసిన సినిమాలని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పటి వరకు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి…

ఇక డేవిడ్ ఫించర్ గురించి చెప్పాలంటే ఈయన తీసిన సినిమాలను చూస్తున్నంత సేపు ప్రేక్షకులు అసలు బోర్ అనేది లేకుండా రెండు గంటల పాటు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా సెవెన్, ఫైట్ క్లబ్, ద కిల్లర్, ద గేమ్ లాంటి సినిమాలతో ఆయన దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రపంచంలోనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను తీయడంలో ఈయనను మించిన తోపు డైరెక్టర్ మరోకరు లేరు అనేది వాస్తవం… ఇక ఈ ఇద్దరి దర్శకులు కూడా తమ శక్తి సామర్థ్యాల మేరకు సూపర్ హిట్ సినిమాలను తీయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.

ఒకవేళ వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచంలోనే ఈ సినిమా కోసం ఎదురుచూసే అభిమానులు కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక మొత్తానికైతే వీళ్ళిద్దరూ హాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యాలనే చెప్పాలి. ఇక వీళ్లకు సంబంధించిన సినిమాలు ఏవైనా మీరు ఇప్పటికి చూడకపోయి ఉంటే చూసేయండి పక్కాగా మిమ్మల్ని రెండు గంటల పాటు ఎంటర్ టైన్ చేస్తాయి…