Kollywood News : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొద్దిమంది టాలెంటెడ్ డైరెక్టర్లలో కార్తీక్ సుబ్బరాజు ఒకరు… ఇక ఈయన ప్రస్తుతం సూర్యని హీరోగా పెట్టి ఒక సినిమాని చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే కార్తీక్ సుబ్బరాజు సినిమాలు అంటేనే ఒక డిఫరెంట్ మూడ్ లో సాగుతుంటాయి.
ఇక ఇప్పుడు ఈయన సూర్య తో చేయబోయే సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక కే జి ఎఫ్ సినిమా ఎలాంటి తరహా ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను మ్యాజిక్ చేసిందో ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్ మూడు ను క్రియేట్ చేస్తూనే అలాంటి ఒక మ్యాజిక్ ను కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాని చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించి వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేయాలని తను చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందుకోసమే ఈ సినిమాలో సూర్య క్యారెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేశారట. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారనే విషయం కూడా తెలుస్తుంది. మరి ఈ సినిమాని ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా భావిస్తున్న కార్తీక్ సుబ్బరాజు సూర్య నుంచి ఎలాంటి పర్ఫామెన్స్ ని రాబట్టుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక కార్తీక్ సుబ్బరాజు ఇంతకుముందు చేసిన జిగర్తండ సినిమాతో బాబీ సింహ ను ఒక అద్భుతమైన పాత్రలో చూపించి అతనికి ‘నేషనల్ అవార్డు’ రావడంలో కీలకపాత్ర వహించాడు.
ఇక అందుచేతనే ఆయన డైరెక్షన్ లో నటించడానికి చాలామంది హీరోలు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఆయన రాసుకున్న ఒక టిపికల్ క్యారెక్టర్ కి తగ్గట్టుగానే హీరో క్యారెక్టేరైజేషన్స్ సాగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని కనక కరెక్ట్ గా చేయగలిగితే పర్ఫామెన్స్ వైజ్ గా చాలా గుర్తింపు అయితే వస్తుంది. ఇక ఆ విషయాన్ని సూర్య కూడా పాటించబోతున్నట్టుగా తెలుస్తుంది…