https://oktelugu.com/

Vikram Box Office Collection: బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన విక్రమ్!

Vikram Box Office Collection: బాహుబలి 2 ఆల్ టైం ఇండియన్ బ్లాక్ బస్టర్ గా ఉంది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ పరిశ్రమల్లో కూడా బాహుబలి 2నే టాప్ గ్రాసర్. ఐదేళ్ల తర్వాత ఈ రికార్డు బ్రేక్ అయ్యింది. ఏపీ,తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడులో బాహుబలి 2 రికార్డు బద్దలైంది. తెలుగులో బాహుబలి 2 కలెక్షన్స్ ఆర్ ఆర్ ఆర్ క్రాస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా ఆర్ ఆర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : June 19, 2022 / 08:41 AM IST
    Follow us on

    Vikram Box Office Collection: బాహుబలి 2 ఆల్ టైం ఇండియన్ బ్లాక్ బస్టర్ గా ఉంది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ పరిశ్రమల్లో కూడా బాహుబలి 2నే టాప్ గ్రాసర్. ఐదేళ్ల తర్వాత ఈ రికార్డు బ్రేక్ అయ్యింది. ఏపీ,తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడులో బాహుబలి 2 రికార్డు బద్దలైంది. తెలుగులో బాహుబలి 2 కలెక్షన్స్ ఆర్ ఆర్ ఆర్ క్రాస్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా ఆర్ ఆర్ ఆర్ రికార్డులకెక్కింది. ఇక కన్నడ చిత్రం కెజిఎఫ్ 2 కర్ణాటకలో టాప్ గ్రాసర్ గా నమోదయ్యింది. బాహుబలి 2 చిత్రం పేరిట ఉన్న ఆల్ టైం టాప్ గ్రాసర్ రికార్డు కెజిఎఫ్ 2 సొంతం చేసుకుంది.

    Vikram movie

    తాజాగా తమిళనాడులో బాహుబలి 2 రికార్డు బ్రేక్ అయ్యింది. విక్రమ్ మూవీతో కమల్ హాసన్ బాహుబలి 2 కలెక్షన్స్ దాటేశారు. బాహుబలి 2 తమిళనాడులో దాదాపు రూ. 146 కోట్ల వసూళ్ళతో ఆల్ టైం టాప్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఈ రికార్డు విక్రమ్ మూవీతో బ్రేక్ అయ్యింది. మూడో వారం కూడా విక్రమ్ కలెక్షన్స్ స్థిరంగా కొనసాగుతుండగా రూ. 150 కోట్లు దాటేసింది. ఆ విధంగా బాహుబలి 2 రికార్డు తమిళనాడులో బ్రేక్ అయ్యింది. 2017 లో బాహుబలి 2 విడుదల కాగా, దాదాపు ఐదేళ్లలో ఎవరూ ఆ రికార్డు టచ్ చేయలేకపోయారు.

    Also Read: Karan Johar: కెజిఎఫ్ 2 మేము తీస్తే మాత్రం నచ్చదు… కరణ్ జోహార్ సంచలన ఆరోపణలు 

    ఇక రాష్ట్రాల వారీగా ఇండస్ట్రీ హిట్స్ గమనిస్తే…. ఏపీ/తెలంగాణాలలో ఆర్ ఆర్ ఆర్ మూవీ, కర్ణాటకలో కెజిఎఫ్ 2, తమిళనాడులో విక్రమ్, కేరళలో పులి మురుగన్ గా ఉన్నాయి. డొమెస్టిక్ గా హిందీలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా బాహుబలి 2 రికార్డు సేఫ్ గా ఉంది. అలాగే ఓవర్ ఆల్ గా హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్ గా బాహుబలి 2 రికార్డు సేఫ్. ఇక కమల్ పనైపోయింది, ఆయన కనీసం హిట్ కొట్టడం కూడా కష్టమే అనుకుంటున్న తరుణంలో విక్రమ్ మూవీతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. విక్రమ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ నాలుగు వందల కోట్ల వైపు దూసుకెళుతున్నారు.

    Vikram movie

    విడుదలైన అన్ని భాషల్లో విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగులో ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్. కేవలం రూ. 7 కోట్లకు కొంటే రూ. 15 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇంకా విక్రమ్ థియేటర్స్ లో ఆడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తున్నాయి. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన విక్రమ్ చిత్రానికి కమల్ నిర్మాతగా ఉన్నారు. ఈ మూవీతో ఆయన భారీగా లాభాలు ఆర్జించారు.

    Also Read:Anchor Suma: ఫైనల్ గా గుడ్ బై చెప్పనున్న యాంకర్ సుమ?

    Tags