Karan Johar: ఇండస్ట్రీ హిట్ కెజిఎఫ్ 2 మూవీని ఉద్దేశిస్తూ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సంచలన కామెంట్స్ చేశారు. సౌత్ వాళ్ళు తీస్తే నచ్చిన ఇదే మూవీ మేము చేస్తే నచ్చేది కాదని ఆయన విమర్శలు గుప్పించారు. కెజిఎఫ్ 2 ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ హిందీలో భారీ ఆదరణ దక్కించుకుంది. రికార్డు ఓపెనింగ్స్ తో కెజిఎఫ్ 2 హిందీ వర్షన్ దాదాపు రూ. 450 కోట్ల వసూళ్లు సాధించింది. ఆర్ ఆర్ ఆర్ మేనియా ముగియక ముందే కెజిఎఫ్ 2 రూపంలో మరో సౌత్ మూవీ బాక్సాఫీస్ బద్దలు కొట్టింది.
అదే సమయంలో ఈ చిత్రానికి పోటీగా విడుదలైన బాలీవుడ్ చిత్రాలు చతికిలబడ్డాయి. కనీస వసూళ్లు రాక డిజాస్టర్స్ గా నిలిచాయి. కాగా కెజిఎఫ్ 2 చిత్ర విజయంపై దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ… కెజిఎఫ్ 2 మూవీ చాలా బాగుంది. నాకు ఆ చిత్రం నచ్చింది. అయితే కెజిఎఫ్ 2 మూవీ మేము (బాలీవుడ్) చేస్తే విమర్శకులకు నచ్చదు. దారుణమైన రేటింగ్స్ ఇస్తారు. నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. కొంచెం కూడా ప్రోత్సహించరు, అని కరణ్ అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Jr NTR Craze in Israel: ఇజ్రాయిల్ మీడియాలో జూ.ఎన్టీఆర్ సంచలనం.. ఏమైంది? ఎందుకు హెడ్ లైన్ అయ్యారు?
సౌత్ చిత్రాలు బాలీవుడ్ ని వరుసగా డామినేట్ చేస్తున్న క్రమంలో ఆయనలో గూడుకట్టుకున్న అసహనం బయటపెట్టారు. పరోక్షంగా ఆయన సౌత్ ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. అయితే ఆయన ఇక్కడ ఓ లాజిక్ మిస్ అవుతున్నారు. క్రిటిక్స్ చెప్పినంత మాత్రాన మంచి సినిమా హిట్ కాకుండా పోదు. దానికి సాహో విజయమే నిదర్శనం. ప్రభాస్ సాహో చిత్రానికి తరణ్ ఆదర్శ్, రాజీవ్ మసంద్ వంటి పాపులర్ క్రిటిక్స్ దారుణమైన రేటింగ్ ఇచ్చారు. కానీ సాహో హిందీ వర్షన్ రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది.
సినిమా విజయం ప్రేక్షకుల అభిరుచి పై ఆధారపడి ఉంటుంది. తెలుగు మూవీ అంటే సుందరానికీ చిత్రం అద్భుతమైన రేటింగ్ దక్కించుకుంది, వసూళ్లు మాత్రం డిజాస్టర్ గా ఉన్నాయి. అలాగే కమల్ విక్రమ్ చిత్రానికి కొందరు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. అనూహ్యంగా ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. కాబట్టి రేటింగ్స్ ఆధారంగా సినిమా ఫలితం నిర్ణయించబడుతుంది అనుకుంటే పొరపాటే.
ఇక కరణ్ జోహార్ నిర్మించిన భారీ పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న విడుదల కానుంది. రన్బీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్స్ గా నటిస్తుండగా నాగార్జున, అమితాబ్, మౌని రాయ్ కీలక రోల్స్ చేస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ లైగర్ చిత్రానికి కరణ్ జోహార్ సహా నిర్మాతగా ఉన్నారు. బ్రహ్మాస్త్ర విడుదలకు ముందు కరణ్ జోహార్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Also Read:Anchor Suma: ఫైనల్ గా గుడ్ బై చెప్పనున్న యాంకర్ సుమ?