Kamal Haasan: నటుడిగా కమల్ హాసన్ ది 60 ఏళ్ల ప్రస్థానం. బాలనటుడిగానే అద్భుతాలు చేసిన కమల్ హీరోగా సినిమా స్థాయి పెంచారు. నటుడిగా ఆయన ఓ లైబ్రరీ. ఆయన చేసిన ప్రయోగాలు, వైవిధ్యమైన పాత్రలు ప్రపంచంలో బహుశా మరో నటుడు చేసి ఉండరు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా కళామతల్లికి సేవ చేశారు. ఈ క్రమంలో విజయాలు, అపజయాలు, విమర్శలు, ప్రశంసలు ఎదురయ్యాయి. 1996లో వచ్చిన భారతీయుడు కమల్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్. దర్శకుడు శంకర్ తిరుగులేని ఊహాజనితమైన కథతో భారతీయుడు తెరకెక్కించాడు. ఒకప్పటి స్వాతంత్ర్య సమరయోధుడు నేటి అవినీతిపై పోరాటం చేస్తే ఎలా ఉంటుందనేది సినిమా సారాంశం.
కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేశాడు. వృద్ధుడు పాత్రలో ఆయన నటన అమోఘం. కమల్ కెరీర్ లో పక్కా కమర్షియల్ హిట్ ఆ చిత్రం. విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్. ఆ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు దాటిపోయింది. భారతీయుడు చిత్రం తర్వాత కమల్ అనేక ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. కామెడీ జోనర్స్ లో నటించారు. విశ్వరూపం వంటి సీరియస్ మూవీస్ చేశారు. దశావతారం లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. కానీ భారతీయుడు రేంజ్ హిట్ మాత్రం పడలేదు.
Also Read: Pruthvi: కమెడియన్ ‘ఫృథ్వీ’ కూతురు సినీ ఎంట్రీ.. ఆమె ఎలా ఉందో తెలుసా!?
నిజం చెప్పాలంటే ఆ స్థాయి కమర్షియల్ హిట్ ఆయనకు దక్కలేదు. దశావతారం, విశ్వరూపం మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. చాలా కాలం తర్వాత ప్రయోగాలకు తెరదించుతూ కమల్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చేశారు. అదే విక్రమ్ మూవీ. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విక్రమ్ మూవీపై మంచి హైప్ ఏర్పడింది. ఈ మధ్య కాలంలో కమల్ నటించిన ఏ చిత్రానికి ఈ స్థాయి బజ్ దక్కలేదు. ఈ మూవీ చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల బిజినెస్ చేసిన విక్రమ్ మేకర్స్ కి రూ. 50 కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది.
మరి భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న విక్రమ్ కమల్ కి భారతీయుడు లాంటి కమర్షియల్ హిట్ కట్టబెడుతుందో లేదో చూడాలి. విక్రమ్ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తుండగా… విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూర్చుతున్నారు.
Also Read:Nandamuri Mokshagna:నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమాకి డైరెక్టర్ ఫిక్స్