Mahesh- Trivikram: మహేష్ తో అయినా కొత్తగా ట్రై చెయ్ త్రివిక్రమ్!

Mahesh- Trivikram: ప్రతి దర్శకుడికి ఓ శైలి ఉంటుంది. కెరీర్ లో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛాయలు తర్వాత చిత్రాల్లో వెంటాడుతూ ఉంటాయి. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ ని ఓ ఫార్ములా, ఫార్మాట్ వెంటాడుతుంది. ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ నుండి వచ్చిన చాలా సినిమాల్లో ఒకే కథ. హీరో అనుకోకుండానో, కావాలనో ఓ కుటుంబానికి దగ్గర కావడం వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు తీర్చడం. అతడు సినిమాతో మొదలైన ఈ తీరు అల వైకుంఠపురంలో వరకు […]

Written By: Shiva, Updated On : June 2, 2022 2:27 pm
Follow us on

Mahesh- Trivikram: ప్రతి దర్శకుడికి ఓ శైలి ఉంటుంది. కెరీర్ లో తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛాయలు తర్వాత చిత్రాల్లో వెంటాడుతూ ఉంటాయి. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ ని ఓ ఫార్ములా, ఫార్మాట్ వెంటాడుతుంది. ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ నుండి వచ్చిన చాలా సినిమాల్లో ఒకే కథ. హీరో అనుకోకుండానో, కావాలనో ఓ కుటుంబానికి దగ్గర కావడం వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు తీర్చడం. అతడు సినిమాతో మొదలైన ఈ తీరు అల వైకుంఠపురంలో వరకు కొనసాగింది. వీటిలో కొన్ని ఫలితాలు ఇవ్వగా కొన్ని బెడిసికొట్టాయి.

Mahesh- Trivikram

ఫ్యామిలీ ఎమోషన్స్ తెరకెక్కించడంలో త్రివిక్రమ్ కి మంచి పట్టు ఉంది. అందుకే ఆయన ఆ జోనర్ నుండి బయటకు రాలేకపోతున్నాడు. అదే సమయంలో పాత సినిమా కథలు, నవలలు, హాలీవుడ్ మూవీస్ స్టోరీస్ తీసుకుని మెరుగులు దిద్ది చిత్రాలు చేస్తాడనే అపవాదు ఉంది. ఆయన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో ఎన్టీఆర్ ఇంటి గుట్టు చిత్రం కథకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇక లార్గోవించ్ అనే ఫ్రెంచ్ చిత్రాన్ని అజ్ఞాతవాసి గా తెరకెక్కించి పరువు పోగొట్టుకున్నాడు. నితిన్ తో చేసిన ‘అ ఆ’ మూవీ యద్దనపూడి సులోచనారాణి రాసిన మీనా నవల ఆధారంగా తెరకెక్కించారు.

Also Read: Kamal Haasan: రెండున్నర దశాబ్దాలు… ఆ రేంజ్ హిట్ కమల్ కి పడలేదు!

Mahesh- Trivikram

ఈ క్రమంలో కనీసం మహేష్ మూవీతో అయినా త్రివిక్రమ్ ఈ సెంటిమెంట్ బద్దలు కొట్టాలని కోరుకుంటున్నారు. మహేష్ తో ఓ సరికొత్త కథతో కమర్షియల్ మూవీ తెరకెక్కిస్తే చూడాలని ఆశపడుతున్నారు. అయితే మహేష్ మూవీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఈ మూవీ కోసం హైదరాబాద్ శివారులో ఓ భారీ కాలనీ సెట్ నిర్మిస్తున్నారట. ఇక ఈ మూవీలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అర్జునుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read:Eight years of Telangana: ఎనిమిదేళ్లలో ఏం సాధించాం.. తెలంగాణ బంగారం అయిందా?
Recomended Videos


Tags