Kalki Movie: ముంబై వేదికగా జూన్ 19న కల్కి 2829 AD ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. మొదటిసారి కల్కి స్టార్ క్యాస్ట్ మొత్తం హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనె వేదిక పంచుకున్నారు. ఇండియన్ సినిమా హబ్ ముంబై వేదికగా జరిగిన ఈ ఈవెంట్ దేశాన్ని ఆకర్షించింది. అన్ని భాషల మీడియా కవర్ చేసింది. కల్కి విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ముంబై ఈవెంట్ తో ప్రమోషన్స్ ముగించారని సమాచారం.
ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం కోట్లలో ఖర్చు చేశారు. కొద్దిరోజుల ముందు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ఈవెంట్ కాస్ట్ రూ. 40 కోట్లు అని సమాచారం. అంతకు మించి ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఖర్చు చేసి ఉండొచ్చు. అయితే ఇంత పెద్ద మెగా ఈవెంట్ నిర్వహించిన తీరు విమర్శల పాలవుతుంది. సదరు ఈవెంట్ కాంట్రాక్టు తీసుకున్న సంస్థ వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది.
Also Read: Deepika Padukone: అంత కడుపుతో పెన్సిల్ హీల్స్ వేసుకొని ‘కల్కీ’ ఈవెంట్ కా?.. దీపికపై నెటిజన్ల పైర్
లైవ్ లో ఈవెంట్ వీక్షిస్తున్న ఆడియన్స్ అసంతృప్తి చెందారు. కారణం కెమెరాల సెటప్ సరిగా లేదు. జూమ్ చేసి చూస్తే కానీ… వేదిక మీదున్న సెలెబ్స్ కనిపించడం లేదు. మీడియా ప్రతినిధులు కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ వద్ద నిర్మాణ విలువలు లేవు. అవుట్ డేటెడ్ గా ఈవెంట్ సాగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్ గొప్పగా ఉంది. ముంబై ఈవెంట్ మాత్రం తేలిపోయింది.
కల్కి వంటి భారీ బడ్జెట్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ ఇంత వరస్ట్ గా ఉంటే… దాని వలన జరిగే నష్టం అంచనా కూడా వేయలేం. దానికి ఈ మూవీలో స్టార్ క్యాస్ట్ ఉన్నా, భారీగా ప్రమోట్ చేస్తున్న పెద్దగా బజ్ ఏర్పడటం లేదు. దానికి కారణం ఏమిటో తెలియదు. కల్కి ట్రైలర్ కి వచ్చిన స్పందన అందుకు నిదర్శనం. కల్కి ట్రైలర్ వ్యూస్.. సలార్, కెజిఎఫ్ 2 చిత్రాల దరిదాపుల్లో కూడా లేవు. ప్రభాస్ డిజాస్టర్ మూవీస్ రాధే శ్యామ్, ఆదిపురుష్ ట్రైలర్స్ ఇంతకు మించిన వ్యూస్ రాబట్టాయి. కాగా కల్కి జూన్ 27న విడుదల అవుతుంది.