Deepika Padukone: అంత కడుపుతో పెన్సిల్ హీల్స్ వేసుకొని ‘కల్కీ’ ఈవెంట్ కా?.. దీపికపై నెటిజన్ల పైర్

ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా గురించి ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా కూడా మెరవబోతుంది.

Written By: Swathi, Updated On : June 20, 2024 3:46 pm

Deepika Padukone

Follow us on

Deepika Padukone: దీపికా పదుకొణె రణబీర్ సింగ్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేమంచి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దీనికి సంబంధించిన శుభవార్తను రీసెంట్ గానే పంచుకుంది ఈ జంట. కానీ నెటిజన్లు ఈ విషయం మీద నెగిటివ్ గా కామెంట్లు చేశారు. చాలా మంది సెలబ్రిటీల మాదిరి దీపికా కూడా సరోగసి ద్వారా పిల్లలకు జన్మిస్తుంది అంటూ పుకార్లు సృష్టించారు. కానీ వాటికి పులిస్టాప్ పెట్టేలా ఓ పోస్ట్ పెట్టి అందరి నోర్లు మూయించింది ఈ బ్యూటీ.

ఇక ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా గురించి ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా కూడా మెరవబోతుంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కు సిద్ధమైంది. దీంతో ప్రమోషన్లు భారీగా చేస్తుంది చిత్ర యూనిట్. ఇందులో భాగంగా ముంబైలో నిర్వహించిన చిత్ర ప్రమోషన్ కు హాజరయ్యారు టీమ్.

ఈ సినిమా ప్రమోషన్స్ కు దీపికా కూడా హాజరయ్యారు. అయితే దీపికా ప్రెగ్నెంట్ అని తెలిసిందే. ఇక బేబీ బంప్ తోనే కాబోయే అమ్మ ప్రమోషన్ కు హాజరవ్వడం తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది దీపికా. మరీ ముఖ్యంగా ఆమె వేసుకున్న హీల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీపికా స్టేజ్ మీదకు ఎంట్రీ ఇస్తున్న సమయంలో వెళ్తున్న సమయంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ లు ఆమె చేయి పట్టుకున్నారు. ప్రెగ్నెంట్ అని కేర్ తీసుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

ఇక దీపికా వేసుకున్న హీల్స్ గురించి కొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తే మరికొందరు ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.కానీ ఈ సమయంలో అంత హైట్ గా ఉన్న హీల్స్ వేసుకోవడం ఏంటి?
జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ మండి పడుతున్నారు. మరికొందరు ఈ సమయంలో హీల్స్ అవసరమా? నిజంగా దీపికా తల్లి కాబోతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం టాలెంటెడ్ దీపికాకు ఆ మాత్రం తెలియదా? ఆమె జాగ్రత్తగానే ఉంటుంది అంటూ సపోర్ట్ చేస్తున్నారు. మరి మీరు ఏమంటారు? కామెంట్ చేయండి..