https://oktelugu.com/

Trivikram Son: బాలీవుడ్ స్టార్స్ ని తలదన్నేలా డైరెక్టర్ త్రివిక్రమ్ కొడుకు… సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సిద్ధమా!

Trivikram Son: బాలీవుడ్ స్టార్స్ ని తలదన్నేలా డైరెక్టర్ త్రివిక్రమ్ కొడుకు... సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సిద్ధమా!

Written By:
  • S Reddy
  • , Updated On : June 20, 2024 / 01:06 PM IST

    Trivikram son Rishi entering into film industry

    Follow us on

    Trivikram Son: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా కెరీర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్ దర్శకుడిగా ఎదిగారు. స్వయంవరం, చిరునవ్వుతో, మన్మధుడు, నువ్వే కావాలి, మల్లీశ్వరి వంటి హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ రచయితగా పని చేశాడు. నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారాడు. త్రివిక్రమ్ తెరకెక్కించిన జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, అ ఆ, సన్ ఆఫ్ సత్యమూర్తి వంటి హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.

    అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2020 సంక్రాంతి విన్నర్ అయ్యింది. ఈ ఏడాది త్రివిక్రమ్ గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల పరంగా పర్లేదు అనిపించింది. మహేష్ క్యారెక్టర్ తీర్చిదిద్దిన తీరు అభిమానులకు బాగా నచ్చింది.

    Also Read: Mahesh Babu: ఆ అభిమాని కోసం మహేష్ చేసిన పని తెలిస్తే సెల్యూట్ చేస్తారు

    త్రివిక్రమ్ పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. సునీల్, ఆర్పీ పట్నాయక్, దర్శకుడు దశరథ్, వేణు తొట్టెంపూడి, రచయిత గోపి మోహన్… ఒకే రూమ్ లో ఉంటూ సినిమా ప్రయత్నాలు చేశారు. సునీల్-త్రివిక్రమ్ అయితే భీమవరం డిఎన్నార్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. వీరిద్దరికీ ఒకే రోజు పెళ్లి జరగడం విశేషం. లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మేనకోడలిని త్రివిక్రమ్ వివాహం చేసుకున్నాడు.

    Also Read: Surekha Vani Daughter: ప్రైవేట్ పార్టీలో రెచ్చిపోయిన సురేఖా వాణి కూతురు సుప్రీత… గ్లామర్ షోకి కుర్రాళ్లు పరేషాన్!

    త్రివిక్రమ్ కి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి రిషి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇటీవల త్రివిక్రమ్ కుటుంబంతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు త్రివిక్రమ్ పెద్ద కొడుకు రిషి మీడియాను ఆకర్షించాడు. తెల్లని రంగు, చక్కని రూపం, ఎత్తుతో బాలీవుడ్ హీరోలను తలపించాడు. దాంతో త్రివిక్రమ్ కొడుకు రిషి హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.