Junior NTR Missed Movies: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేయడం అనేది సర్వసాధారణం…ఎందుకంటే ఆ హీరో ఆ కథకి సెట్ అవ్వకపోవడం వల్ల గాని లేదంటే దర్శకుడు కథ చెప్పిన విధానం హీరోకి నచ్చకపోవడం వల్ల గానీ, ఆ దర్శకుడు సినిమాని హ్యాండిల్ చేస్తాడనే నమ్మకం హీరోకి లేకపోవడం ఏదైనా కారణం కావచ్చు. మొత్తానికైతే అలా స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలను వదిలేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక కొంతమంది మాత్రం వాళ్లు వదిలేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకుంటారు. మరి కొంతమంది మాత్రం వాళ్ళు వదిలేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తే మాత్రం కొంతవరకు డీలా పడిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం కెరియర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించాడు… అయితే ఎన్టీఆర్ చేయాలనుకున్న రెండు సినిమాలను ఒక స్టార్ హీరో లాక్కున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి… ఆ రెండు సినిమాలు ఏంటి? ఆ సినిమాలు సక్సెస్ అయ్యాయా? లేదంటే ఫెయిల్యూర్ గా మారాయా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అయితే గోపీచంద్ హీరోగా మారి చేసిన ‘యజ్ఞం’ సినిమాని మొదట ఎన్టీఆర్ చేయాలనుకున్నాడట.
Also Read: గూగుల్ డేటా సెంటర్‌పై జగన్ కి ఎందుకంత కడుపుమంట?
అప్పుడు దర్శకుడుని మార్చమని ప్రొడ్యూసర్ పోకూరి బాబు రావు కి చెప్పాడట. వి వి వినాయక్ డైరెక్షన్ చేస్తే నేను సినిమా చేస్తానని ఎన్టీఆర్ చెప్పాడట. దాంతో దర్శకుడు రవికుమార్ చౌదరి ఆ కథని గోపీచంద్ కి చెప్పి అతన్ని ఒప్పించి ఆ సినిమా చేశాడు. సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక గోపీచంద్ చేసిన ‘ఆంధ్రుడు’ సినిమాని సైతం మొదట ఎన్టీఆర్ చేయాలనుకున్నాడట.
కానీ అది కార్యరూపం దాల్చలేదు. మొత్తానికైతే గోపీచంద్ ఈ రెండు సినిమాలను చేసి ఆయన ఖాతాలో రెండు సక్సెస్ లను వేసుకున్నాడు. ఇలా ఎన్టీఆర్ చేయాల్సిన రెండు సినిమాలను గోపీచంద్ లాక్కున్నాడు అంటూ గతంలో వార్తలైతే వచ్చాయి.
నిజానికి ఎన్టీఆర్ సరైన డిసీజన్ తీసుకోకపోవడం వల్లే గోపీచంద్ ఈ సినిమాలను చేశారు తప్ప అతని దగ్గరనుంచి లాక్కోలేదు… ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతుంటే గోపీచంద్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు…