Ram Charan Movies Top Directors: మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్నాడు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి… రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమాలను చేసి కూడా టాప్ డైరెక్టర్ గా ఎదగలేకపోయిన కొంతమంది దర్శకులైతే ఉన్నారు. అందులో మొదట గా మనం సంపత్ నంది గురించి చెప్పుకోవాలి. ఆయనకి రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమాని ఆవరేజ్ సక్సెస్ గా నిలిపాడు. దాంతో ఆయన టాప్ డైరెక్టర్ గా మాత్రం మారలేకపోయాడు. ఆ తర్వాత కాలంలో ఆయన చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఆయన పూర్తిగా డీలా పడిపోయాడు. ఇక ఇప్పటికైనా ఆయన భారీ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: గూగుల్ డేటా సెంటర్‌పై జగన్ కి ఎందుకంత కడుపుమంట?
బొమ్మరిల్లు సినిమాతో తన సత్తా చాటుకున్న బొమ్మరిల్లు భాస్కర్ సైతం రామ్ చరణ్ తో ఆ రేంజ్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. అయినప్పటికి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కానీ ఆ తర్వాత కాలంలో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఆయన పూర్తిగా డీలా పడిపోయాడు.
ఆయన చేసిన సినిమాలు చేసినట్టుగా నిరాశ పరుస్తుండటం తో ఆయన ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంలో స్పెషల్ కేర్ తీసుకొని మరి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇదంతా చూస్తున్న సినిమా మేధావులు సైతం స్టార్ హీరోతో అవకాశం వచ్చినప్పుడు కేర్ ఫుల్ గా సినిమాలు చేస్తే స్టార్ డైరెక్టర్ గా మారుతారు.
ఏమాత్రం తేడా కొట్టినా కూడా ఆ సినిమాతో పాటు వాళ్ళ కెరియర్ కూడా డౌన్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్టార్ హీరోని డైరెక్షన్ చేస్తే బాగుంటుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…