https://oktelugu.com/

Junior NTR : జపాన్ థియేటర్స్ లో ఎన్టీఆర్ మేనియా..గూస్ బంప్స్ రప్పించే వీడియో!

Junior NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్(Junior NTR) నటించిన 'దేవర'(Devara Movie) చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

Written By: , Updated On : March 25, 2025 / 08:33 AM IST
Junior NTR

Junior NTR

Follow us on

Junior NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్(Junior NTR) నటించిన ‘దేవర'(Devara Movie) చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. #RRR వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత విడుదలైన సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు మొదటి నుండి భారీగానే ఉండేవి. దానికి తోడు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ దగ్గర నుండి లాంగ్ రన్ వరకు దంచి కొట్టేసింది. ముఖ్యంగా లాంగ్ రన్ విషయం లో ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ రన్ దేవర కి దక్కింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఆరంభం లో కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చడంతో ఈ సినిమా రేంజ్ మారిపోయింది. థియేటర్స్ లోనే కాదు, నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Also Read : మందు, సిగిరెట్స్ తో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్..ఫోటోలు వైరల్!

సుమారుగా 9 వారాలు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అయిన ఈ చిత్రాన్ని ఇతర దేశానికీ సంబంధించిన వాళ్ళు కూడా ఎగబడి చూసారు. అలా ఇతర దేశాలకు సంబంధించిన ఆడియన్స్ లో ఉన్నటువంటి క్రేజ్ ని గమనించిన మూవీ టీం, ఈ చిత్రాన్ని జపాన్(Japan) భాషలో భారీ లెవెల్ లో విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ నెల 28న జపాన్ లో ఈ చిత్రం విడుదల అవ్వబోతుండగా, ప్రొమోషన్స్ లో పాల్గొనడం కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా జపాన్ కు వెళ్లాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన జపాన్ అభిమానులతో కలిసి ఒక ప్రీమియర్ షో ని వీక్షించాడు. ఈ ప్రీమియర్ షో ఇంటర్వెల్ లో ఆయన స్టేజి మీదకు ఎక్కి అభిమానులతో సెల్ఫీ తీసుకున్న వీడియో ని మూవీ టీం సోషల్ మీడియా లో విడుదల చేయగా అది బాగా వైరల్ అయ్యింది.

అంతే కాకుండ విడుదలకు వారం రోజుల ముందే జపాన్ ఆడియన్స్ పెద్ద ఎత్తున ఎన్టీఆర్ కి సంబంధించిన సెలబ్రేషన్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ కి మొదటి నుండి జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక #RRR చిత్రం తర్వాత ఆ క్రేజ్ పదింతలు ఎక్కువ అయ్యింది. ఇప్పుడు దేవర చిత్రానికి అక్కడ ఊపు ఎలా ఉందంటే, #RRR రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్ని థియేటర్స్ లో భారీగా జరిగాయి. ఆల్ టైం రికార్డు నెలకొల్పడానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయి. 2023 వ సంవత్సరం లో రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయగా, జపాన్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుమారుగా ఫుల్ రన్ 40 మిలియన్ డాలర్లను రాబట్టింది. మరి ‘దేవర’ చిత్రం ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.

Also Read : రామ్ చరణ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరంటే!