https://oktelugu.com/

Ram Charan And NTR: రామ్ చరణ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరంటే!

Ram Charan And NTR కీరవాణి గత చిత్రాల సంగీతంతో పోలిస్తే పెద్ద గొప్పదేమీ కాదు, ముఖ్యంగా బాహుబలి పాటలు, మ్యూజిక్ తో పోల్చుకోదగ్గ సంగీతం కూడా కాదు, అయినప్పటికీ ఆ చిత్రానికి ఆస్కార్ అవార్డు అవార్డు వచ్చిందంటే ఈ ఇద్దరు హీరోలే ముఖ్య కారణం.

Written By: , Updated On : March 21, 2025 / 09:26 PM IST
Ram Charan And NTR (1)

Ram Charan And NTR (1)

Follow us on

Ram Charan And NTR: టాలీవుడ్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం #RRR. ఈ సినిమా అంతటి రేంజ్ రీచ్ వెళ్ళడానికి కేవలం రాజమౌళి ఒక్కడే కాదు, రామ్ చరణ్(Global Star Ram Charan), ఎన్టీఆర్(Junior NTR) కూడా ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే పెద్దగా స్టోరీ బలం లేని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడి అంతటి అద్భుతాలను క్రియేట్ చేసిందంటే ఈ ఇద్దరు హీరోలే అందుకు ముఖ్య కారణం. ముఖ్యంగా ఈ ఇద్దరి హీరోల మధ్య కెమిస్ట్రీ గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. సిల్వర్ స్క్రీన్ పై వీళ్ళను చూస్తున్నంతసేపు నిజమైన స్నేహితులుగా, నిజమైన సోదరులుగా అనిపించారు. అందుకే ఈ చిత్రం కమర్షియల్ గా ఆ రేంజ్ లో వర్కౌట్ అయ్యింది. నాటు నాటు పాటకు కీరవాణి(MM Keeravani), చంద్రబోస్(Chandra Bose) లు ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. వాస్తవానికి ఆ పాటకు ఆస్కార్ అవార్డు(Oscar Awards) ఇవ్వాల్సింది వీళ్ళిద్దరికే.

Also Read: ఆరోజు మమ్మల్ని చూసి ప్రధాని కన్నీళ్లు పెట్టుకున్నారు – చిరంజీవి!

పాట కీరవాణి గత చిత్రాల సంగీతంతో పోలిస్తే పెద్ద గొప్పదేమీ కాదు, ముఖ్యంగా బాహుబలి పాటలు, మ్యూజిక్ తో పోల్చుకోదగ్గ సంగీతం కూడా కాదు, అయినప్పటికీ ఆ చిత్రానికి ఆస్కార్ అవార్డు అవార్డు వచ్చిందంటే ఈ ఇద్దరు హీరోలే ముఖ్య కారణం. వీళ్లిద్దరి తరుపున కీరవాణి, చంద్రబోస్ అవార్డు తీసుకున్నారు అన్నమాట. అయితే ఈ సినిమా కి సీక్వెల్ ఉంటుందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇది వరకే చెప్పుకొచ్చాడు. కానీ ఎప్పుడు ఉంటుంది, ఏమిటి అనేది క్లారిటీ లేదు. అసలు ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోల కమిట్మెంట్స్ ని చూస్తే ఉండదు అనే అనిపిస్తుంది. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో సినిమా మాత్రం రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాని ఒక సినిమాటిక్ యూనివర్స్ గా మార్చాలి అనే ప్లాన్ లో ఉన్నాడట ప్రశాంత్ నీల్(Prashanth Neel). స్టోరీ ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తుందట. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు రామ్ చరణ్ ముఖ్య పాత్రలో కనిపిస్తాడట. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా ఖరారై చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమాకు కొనసాగింపుగా ఆ చిత్రం ఉంటుందట. రామ్ చరణ్ క్యారక్టర్ ని ఈ సినిమాలోనే పరిచయం చేస్తారట. మరి ఈ కొనసాగింపు చిత్రం లో ఎన్టీఆర్ ఉంటాడో లేదో తెలియదు కానీ, రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా ఒక సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే షూటింగ్ ని మొదలు పెట్టుకున్న #NTRNeel చిత్రం మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.

 

Also Read:  ‘ఐరన్ మ్యాన్’ తరహా సూపర్ హీరో కథలో రవితేజ..డైరెక్టర్ ఎవరంటే!