https://oktelugu.com/

Suhas : నన్నెందుకు టార్చర్ చేస్తున్నారు అంటూ రిపోర్టర్ ప్రశ్నపై హీరో సుహాస్ ఫైర్!

Suhas : ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఒక కమెడియన్ గా గొప్పగా రాణించి, ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో కమర్షియల్ సూపర్ హిట్స్ ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ని ఏర్పాటు చేసుకున్న హీరో సుహాస్(Hero Suhas).

Written By: , Updated On : March 25, 2025 / 08:40 AM IST
Suhas

Suhas

Follow us on

Suhas : ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఒక కమెడియన్ గా గొప్పగా రాణించి, ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో కమర్షియల్ సూపర్ హిట్స్ ని అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ని ఏర్పాటు చేసుకున్న హీరో సుహాస్(Hero Suhas). సుహాస్ సినిమా అంటే కచ్చితంగా ఎదో స్పెషల్ ఉంటుంది అనే రేంజ్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవడం లో సక్సెస్ అయ్యాడు. కేవలం హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా మధ్యమధ్యలో కమెడియన్, విలన్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు సుహాస్. గత ఏడాది ఆయన హీరో గా నటించిన సినిమాలు 5 విడుదల అయ్యాయి. అందులో రెండు సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ‘ఓ భామ అయ్యో రామ'(Oh Bhama Ayyo Rama) అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది.

Also Read : ఓటిటి లో సుహాస్ రియల్ హీరోనా..? ఆయన సినిమా ఓటిటి లో దుమ్మురేపడానికి కారణం ఏంటి..?

ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ లో విలేఖరులు సుహాస్ ని కాస్త ఇబ్బందికి గురి చేసే ప్రశ్నలను అడిగారు. ఒక విలేఖరి సుహాస్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈమధ్య హీరోలు యాడ్స్ తెగ చేసేస్తున్నారు. ఒక సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ ని, కేవలం ఒక్క యాడ్ కోసం తీసుకుంటున్నారట, బయట ఇది ఇప్పుడు హాట్ టాపిక్. ఇందులో ఎంత వరకు నిజముంది?’ అని అడగగా, దానికి సుహాస్ సమాధానం చెప్తూ ‘దీనమ్మ జీవితం. నాకు ఇదేమి టార్చర్ బాబోయ్. యాడ్ చేసినందుకు నాకు మంచిగానే డబ్బులు ఇచ్చారు. కానీ మీ ఊహల్లో ఉన్నంత మాత్రం తీసుకోలేదు. ఈ సినిమా గురించి, అందులో నేను చేసిన యాక్టింగ్ గురించి అడగడం మానేసి, రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతారేంటి?’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు సుహాస్.

పైకి నవ్వుతున్నప్పటికీ, లోపల ఉన్న కోపాన్ని ఆపుకొని మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఇది ఇలా ఉండగా ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాని V ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ వల్ల నిర్మించగా, మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటించింది. ఈమె ఒకప్పుడు పాపులర్ సింగర్, కానీ ఇప్పుడు హీరోయిన్ గా మారి తమిళం లో కొన్ని సినిమాలు చేసింది. ఇప్పుడు తెలుగులోకి ఈ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అదే విధంగా ఈ చిత్రం రామ్ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. టీజర్ చూస్తుంటే చాలా ఫన్నీ గా అనిపించింది. సుహాస్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడినట్టే అనే ఫీల్డ్ రప్పించింది. చూడాలి మరి సినిమా విడుదల తర్వాత కూడా అలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందా లేదా అనేది.

Also Read : కలర్ ఫోటో సుహాన్ కష్టాల కడలి వింటే కన్నీళ్లు ఆగవు..