Junior NTR: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ వాడివేడిగా సాగుతూ ముందుకు దూసుకుపోతుంది..వైసీపీ ప్రభుత్వం తీసుకునే సరికొత్త నిర్ణయాలు ప్రకంపనలు రేపుతోంది..దశాబ్దాల నుండి మెరుగైన విద్య ని అందిస్తూ ఎంతో మంది డాక్టర్లను తయారు చేసిన ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ చుట్టూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు మొత్తం తిరుగుతున్నాయి..ఈ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరుని తీసి వేస్తూ YSR పేరు నామకరణం చేస్తునట్టు ప్రభుత్వం ఇటీవల చేసిన ఒక ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది..ఎక్కడ చూసిన ఈ అంశం గురించే చర్చ..దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ తెలుగు దేశం కార్యకర్తలు మరియు నాయకుల నుండి తీవ్రమైన వ్యతిరేక జ్వాల రగులుతుంది..ఎన్టీఆర్ మరియు YSR అశేష ప్రజాదరణ పొందిన మహా నాయకులని..ఎన్టీఆర్ పేరు తీసి YSR పేరు పెట్టడం వల్ల YSR స్థాయి పెరగదు..ఎన్టీఆర్ స్థాయి తగ్గదు..అంటూ ఎన్టీఆర్ వేసిన ఒక ట్వీట్ ఆయన పై తెలుగు పార్టీ క్యాడర్ తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉండడం గత కొద్దీ రోజుల నుండి మనం చూస్తూనే ఉన్నాము.

అయితే తన పై వస్తున్నా విమర్శలను గమనించిన ఎన్టీఆర్ తనదైన శైలి లో తెలుగు తమ్ముళ్లను శాంతపరిచే ప్రయత్నం చెయ్యబోతున్నట్టు రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్న మాట..అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలోనే ఎన్టీఆర్ విజయవాడ లో ఒక మహా ధర్నా చెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఇందుకోసం ఎన్టీఆర్ టీం పోలీస్ ప్రొటెక్షన్ కొరకు సంప్రదించినట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ..ఎన్టీఆర్ పేరు ని తిరిగి యూనివర్సిటీ కి పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా సాగబోతుందట..ప్రతి తెలుగోడు ఈ ధర్నా ని లైవ్ టెలికాస్ట్ లో చూసే విధంగా ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయట.

ఇప్పటి వరుకు నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ పేరు ని తొలగించడం పై స్పందించారు కానీ..ఇలా ప్రత్యక్షంగా రంగం లోకి దిగి నిరసన కార్యక్రమాలు వంటివి చెయ్యలేదనే చెప్పాలి..కానీ జూనియర్ ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు అని వార్తలు రావడం తో నందమూరి అభిమానులు తాత కి తగ్గ మనవడు అంటే ఇలా ఉండాలి అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు..ఈ ధర్నా లో ఎన్టీఆర్ తో పాటుగా ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా పాల్గొనబోతున్నాడట.