Ram Gopal Varma : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. ఆయన తెల్లారి లేస్తే చాలు ఏదో ఒక వివాదం లేనిదే పూటగడవదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో.. దేశంలో ఏం జరిగినా సరే వెంటనే అందులో పెట్రోల్ పోసి ఆ మంటల్లో చలికాచుకుంటాడు. ఇటీవల టాలీవుడ్ మేరునగం ‘కృష్ణంరాజు’ మరణిస్తే కనీసం ఒకరోజైనా షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వని టాలీవుడ్ పెద్దలను వర్మ కాస్త గట్టిగానే ప్రశ్నించాడు. ఇక బాలీవుడ్ లో రూపొందుతున్న కంగనా రౌనత్ ‘ఎమర్జెన్సీ’ చిత్రంపై కాంగ్రెస్ పార్టీని దెప్పిపొడిచాడు.

ఇప్పుడు మళ్లీ కేసీఆర్ పై పడ్డాడు వర్మ. ఏకంగా ప్యాన్ ఇండియా హీరోలతో పోల్చి మరీ కాస్తా గాలి కొట్టాడు. మన ప్యాన్ ఇండియా స్టార్ల కంటే కేసీఆర్ పొలిటికల్ స్టార్ అంటూ నెత్తినపెట్టుకున్నాడు. సడెన్ గా వర్మ ఇలా కేసీఆర్ పై ఎందుకు పడ్డాడో తెలియక అందరూ తికమకపడుతున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రియల్ ప్యాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అంటూ పొగిడాడు రాంగోపాల్ వర్మ. ఈమేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్2 సినిమాల అడుగుజాడల్లో నడుస్తూ టీఆర్ఎస్ పార్టీ కూడా పాన్ ఇండియా వైడ్ గా బీఆర్ఎస్ గా వెళుతుంది. రీల్ ఫిల్మ్ స్టార్స్ యష్, ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్, అల్లు అర్జున్ వలే కాకుండా.. రియల్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్’ అంటూ రాంగోపాల్ వర్మ ఆకాశానికెత్తేశాడు.
టాలీవుడ్ నుంచి ప్యాన్ ఇండియాకు వెళ్లిన తెలుగు హీరోలు అందరూ హిట్ అయినట్టే.. కేసీఆర్ కూడా ఇదే తెలుగు రాష్ట్రం నుంచి వెళ్లి హిట్ కావాలని రాంగోపాల్ వర్మ బలంగా కోరుకుంటున్నట్టు ఉన్నాడు. మన హీరోలను ఆదరించిన హిందీ జనాలు.. మన కేసీఆర్ ను కూడా ఆదరించాలని ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ జాతీయ పార్టీ ప్లాన్లు ఎంత మేరకు సఫలమవుతాయన్నది వేచిచూడాలి. కానీ ఇప్పటికైతే ఎలాంటి ఉలుకూ పలుకూ లేకుండా కేసీఆర్ ఉన్నారు.
దసరాకు జాతీయ పార్టీని స్తాపించి జాతీయ రాజకీయాల్లోకి వెళతానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఊపులోనే రాంగోపాల్ వర్మ కూడా మరింత బూస్ట్ నిద్దామని ఈ పనిచేసినట్టున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. దసరాకు కేసీఆర్ జాతీయపార్టీని ప్రకటించడం లేదు. దీని వెనుక కారణాలేవైనా సరే కేసీఆర్ జాతీయ అడుగులపై రాజకీయవర్గాల్లోనే కాదు.. సినీ వర్గాల్లోనూ ఆసక్తి ఉన్నట్టు కనిపిస్తోంది.
Following the footsteps of BB, RRR, PUSHPA and KGF 2 , TRS too goes PAN INDIA as BRS ..Unlike the REEL FILM STARS #Yash #Tarak #prabhas #RamCharan #AlluArjun the REAL PAN INDIA POLITICAL STAR is #KCR 💐
— Ram Gopal Varma (@RGVzoomin) September 27, 2022
[…] Also Read: Ram Gopal Varma : ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ ర… […]
[…] Also Read: Ram Gopal Varma : Prabhas, NTR, Charan, Bunny reel stars.. KCR Pan India star.. Varma is back again! […]
[…] Also Read: Ram Gopal Varma : ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ ర… […]
[…] Also Read: Ram Gopal Varma : Prabhas, NTR, Charan, Bunny reel stars.. KCR Pan India star.. Varma is back again! […]