Vikram- Sada: జయం మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన సదా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. హాఫ్ శారీ ధరించి పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె అద్భుతం చేశారు. దర్శకుడు తేజా తెరకెక్కించిన జయం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అప్పట్లో యూత్ ని ఊపేసిన చిత్రం అది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చేవి. ఈ మూవీతోనే నితిన్ కూడా హీరోగా పరిచయమయ్యాడు. జయం మూవీ సదా, నితిన్ లకు గట్టి పునాది వేసింది. ముఖ్యంగా సదాను హీరోయిన్ గా నిలబెట్టింది. సదాకు ఎన్టీఆర్ వంటి స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ దక్కింది. నాగ మూవీలో సదా ఎన్టీఆర్ కి జంటగా నటించారు.

జయం తర్వాత సదా కెరీర్ లో అతిపెద్ద హిట్ అపరిచితుడు. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించింది. హీరో విక్రమ్ తన నటనతో అద్భుతం చేశాడు. బ్రాహ్మణ అమ్మాయిగా క్యూట్ లుక్స్ తో సదా కట్టిపడేసింది. అయితే ఈ మూవీ సెట్స్ లో ఓ అరుదైన సంఘటన జరిగిందట. సదాతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన విక్రమ్ షాట్ అయిపోక సిస్టర్ అన్నాడట. హీరో అలా పిలవడం ఆమెకు కూడా కొత్తగా అనిపించిందట.
అపరిచితుడు మూవీ సెట్స్ లో విక్రమ్ సదాను సిస్టర్ అనే పిలిచేవాడట. దీంతో ఆమె కూడా విక్రమ్ ని అన్నయ్య అనేవారట. ఒకరోజు విక్రమ్-సదా ఇలా పిలుచుకోవడం చూసి దర్శకుడు శంకర్ కోప్పడ్డారట. హీరో-హీరోయిన్ అంటే ప్రేక్షకులకు లవర్స్ అన్న భావన కలగాలి. మీరు బ్రదర్, సిస్టర్ అని పిలుచుకుంటున్నారని బయట తెలిస్తే ప్రేక్షకులు రొమాంటిక్ గా ఊహించుకోలేరని గట్టిగా చెప్పాడట.

దాంతో ఇంకెప్పుడు విక్రమ్ సదాను సిస్టర్ అని పిలవలేదట. ఓ ఇంటర్వ్యూలో సదా ఈ విషయం చెప్పుకొచ్చారు. అలాగే ఆమెకు చంద్రముఖి ఆఫర్ మిస్ అయినట్లు వెల్లడించారు. డేట్స్ అడ్జస్ట్ కాక రజినీకాంత్ సర్ ప్రాజెక్ట్ వదులుకోవాల్సి వచ్చిందన్నారు. ఇక మంచి ఆరంభం లభించినా సదా కెరీర్ నిర్మించుకోలేకపోయింది. కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ లభించినా పునాది వేసుకోలేకపోయింది. సదా చాలా తర్వాత ఫేడ్ అవుట్ అయ్యారు. ప్రస్తుతం సదా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కొన్ని బుల్లితెర ఈవెంట్స్ లో కూడా దర్శనమిస్తున్న సదా అడపాదడపా చిత్రాల్లో నటిస్తున్నారు.