Jr NTR: నందమూరి తారక రామారావు 101వ జయంతి(NTR Jayanthi) నేడు. 1923 మే 28న ఆయన జన్మించారు. లెజెండరీ నటుడు, రాజకీయవేత్త ఎన్టీఆర్(NTR) ని అభిమానులు స్మరించుకుంటున్నారు. ఆయన కీర్తిని గుర్తు చేసుకుంటున్నారు. వెండితెరను దశాబ్దాలు పాటు ఏలారు ఎన్టీఆర్. ముఖ్యంగా పౌరాణిక పాత్రలకు, చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. రాముడు, దుర్యోధనుడు, కృష్ణుడు వంటి పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టారు. వెండితెర వేల్పుగా ఎన్టీఆర్ పూజించబడ్డారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చారు.
చైతన్య రథం పేరుతో బస్సు యాత్ర చేసిన ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అభిమానులు, కుటుంబ సభ్యులు నివాళులు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ నేడు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించారు. తాతయ్యకు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Also Read: Senior NTR: తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఒకే ఒక్కరు ఎన్టీయార్..
ఇటీవల టీడీపీ నేత బుద్ధా వెంకన్న(Buddha Venkanna) కీలక కామెంట్స్ చేశాడు. టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదన్నారు. బుద్ధా వెంకన్న కామెంట్స్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆవేదనకు గురి చేశాయి. దీనికి ప్రతిగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కి అనుకూలంగా అభిమానులు సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా… తాతను స్మరించుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Also Read: NTR: జూ. ఎన్టీఆర్ పడ్డ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
”మీ పాదం తగలక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది… మీ రూపు కానక తెలుగు హృదయం తల్లడిల్లిపోతుంది… పెద్ద మనసుతో ఈ ధరిత్రిని ఈ గుండెను ఒకసారి తాకిపో తాతా” అని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ పోస్ట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ వైరల్ అవుతుంది. నందమూరి ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-బాలయ్య అభిమానులుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడలేదని జూనియర్ ఎన్టీఆర్ ని ఓ వర్గం టార్గెట్ చేస్తుంది. ఎన్టీఆర్ వర్థంతికి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలు బాలయ్య తొలగించాడు.
— Jr NTR (@tarak9999) May 28, 2024