Senior NTR: విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్న “శ్రీ నందమూరి తారక రామారావు గారు” తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. ఇక తెలుగు సినిమా హీరోగా తను నటించి మెప్పించడం అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయమనే చెప్పాలి. ఆయన ఏ పాత్ర వేసిన అందులో ఒదిగిపోయి నటించడం ఆయన నైజం…
రాముడిగా, కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా ఇలా ఎన్నో పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించాడు. క్రమ శిక్షణకు మారు పేరుగా, నిజాయితీకి నిలువెత్తు రూపం గా మారరు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని పెంచింది కూడా తనే కావడం విశేషం…ఇక తెలుగు సినిమాలని తమిళ్ సినిమా ఇండస్ట్రీ తొక్కేయాలని చూసినప్పుడు సపరేట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ కు తీసుకో రావడంలో చాలావరకు కృషి చేశాడు.
ఇక తను పాలిటిక్స్ లోకి వెళ్లి సీఎం అయిన తర్వాత ఎంతో ఉపయోగకరమైన పథకాలను పెట్టి పేద ప్రజలను సైతం ఆదుకున్నాడు. అందుకే ఇప్పటికీ కూడా చాలా మంది ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్ అని చెబుతారు. హీరోగా ప్రేక్షకులను ఎంతలా మెప్పించాడో సీఎంగా అంతకుమించి జనం నుంచి ఆదరణ పొందాడు. ఇక మొత్తానికైతే నందమూరి తారక రామారావు పేరు చెబితే ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా ఆనందపడతాడు. ఎందుకంటే ఆయన సాధించిన ఘనత అలాంటిది తెలుగులో కూడా అద్భుతమైన సినిమాలు వస్తాయి అని అన్ని సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తెలిసేలా చేసిన ఒకే ఒక్క నటుడు ఎన్టీఆర్…
ఆయన చేయాలనుకున్న ప్రతి పాత్రని చేసేశాడు. కమర్షియల్ సినిమాలను చేస్తూనే పౌరాణిక సినిమాలకు పెట్టింది పేరుగా మారాడు. ఆయన లాంటి పాత్రలను మరెవరు పోషించలేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికి కూడా రాముడు, కృష్ణుడిల పేరు చెబితే తన రూపం మాత్రమే గుర్తుకొస్తుంది అంటే తెలుగు సినిమా అభిమానులతో పాటుగా ఇండియన్ సినిమా అభిమానులను కూడా ఎంతలా మెస్మరైజ్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ఈ రోజు ఈ మహానుభావుడి 101 వ జయంతి కావడం విశేషం… ఇక ఈ సందర్భంగా మరోసారి ఆయన్ని మనం గుర్తు చేసుకోవడం ఆయనకి మనం ఇచ్చే గొప్ప గౌరవం అనే చెప్పాలి…