https://oktelugu.com/

NTR: జూ. ఎన్టీఆర్ పడ్డ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

కొడాలి నాని ఏం మాట్లాడాడు అనుకుంటున్నారా? ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ అని.. అతని టాలెంట్ వల్లే ఈరోజు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు అని.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అంటూ కొనియాడారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 24, 2024 / 01:14 PM IST

    NTR

    Follow us on

    NTR: సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూ. ఎన్టీఆర్ తనదైన ముద్రవేసుకున్నారు. దివంగత నటుడు హరికృష్ణ చిన్నబ్బాయిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినా.. అతని తాతగారి పోలికలు ఉండటం వల్ల బాగా కలిసొచ్చింది. సినీ బ్యాగ్రౌండ్ కాబట్టి వెంటనే స్టార్ అవుతారు అనుకున్నారు అందరూ. కానీ అతని కెరీర్ ప్రారంభంలో కుటుంబం అండగా లేకపోవడంతో.. కొత్త నటుల మాదిరి ఎన్టీార్ కూడా చాలా కష్టపడ్డారు.

    ఎంత కష్టం వచ్చినా వాటిని లెక్క చేయకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్ ను సంపాదించారు. తాతకు తగ్గ మనవడు అనే పేరు సంపాదించడమే కాదు ఏకంగా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు ఎన్టీఆర్. ‘స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలకి సినీ కెరీర్ అంతా పూలపాన్పు మాదిరి ఉంటుందినుకుంటారు చాలా మంది. అది కొన్ని విషయాల్లో నిజం కూడా..! కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం పూర్తి భిన్నంగా జరిగింది. అందుకే అభిమానులకు అతను చాలా స్పెషల్. ఇక ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్ కొడాలి నాని ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

    ఇంతకీ కొడాలి నాని ఏం మాట్లాడాడు అనుకుంటున్నారా? ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ అని.. అతని టాలెంట్ వల్లే ఈరోజు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు అని.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అంటూ కొనియాడారు. మొదటి నుంచి అతన్ని ఫ్యామిలీ తక్కువ చేసి చూసింది అంతేకాదు కనీసం అతన్ని కుటుంబంలో జరిగే శుభకార్యాలకు కూడా ఆహ్వానించలేదు అంటూ తెలిపారు.

    మొదట్లో అతని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినా కూడా అతనికి ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టారు నిర్మాతలు అంటూ గుర్తు చేశారు కొడాలి నాని. అంతేకాదు అతను సినిమా యూనిట్ తో కలిసి లైన్లో నిలబడి భోజనం చేసిన రోజులు కూడా ఉన్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హీరో అయినప్పటికీ తినేటప్పుడు ఇతనికి మొదట్లో కుర్చీ కూడా వేయకుండా అవమానించిన వాళ్ళు కూడా ఉన్నారంటూ గుర్తు చేసుకున్నారు. ఇలా ఒక్క రకంగా కాదు.. పెద్ద కుటుంబానికి చెందిన హీరో అయినా కూడా అతను కొత్త నటుడులానే ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఈ రోజు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు అంటూ తెలిపారు కొడాలి నాని.