Bigg Boss Priyanka: ఇండియాలో సహజీవనం కల్చర్ అంతకంతకూ పెరిగిపోతుంది. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా ఈ సంస్కృతికి అలవాటు పడ్డారు. వివాహం కాకుండానే అమ్మాయి అబ్బాయి కలిసి జీవించడం పెద్ద నేరంగా భావించడం లేదు. మారిన జీవన విధానం, ఆలోచనలు యువతలో లివ్ ఇన్ రిలేషన్ కి దారితీస్తున్నాయి. కొందరైతే పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా లేదా సహజీవనం చేస్తూ గడిపేయాలని భావిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ఇదే మార్గం అనుసరిస్తుంది.
ప్రియాంక జైన్ పలు సీరియల్స్ లో హీరోయిన్ గా నటించింది. మౌన రాగం సీరియల్ లో తనతో జతకట్టిన శివ కుమార్ అనే నటుడిని ప్రేమించింది. కొన్నాళ్లుగా వీరు సహజీవనం చేస్తున్నారు. తన ప్రేమ విషయాన్ని ప్రియాంక జైన్ బిగ్ బాస్ షో వేదికగా తెలియజేసింది. ఇక ఫ్యామిలీ వీక్ లో కంటెస్టెంట్స్ ని కలవడానికి కుటుంబ సభ్యులు వచ్చారు. ప్రియాంక కోసం మాత్రం ప్రియుడు శివ కుమార్ వచ్చాడు.
Also Read: Actress: ఈ చిన్నారి.. ఇప్పుడు ట్రెండీ బ్యూటీ.. ఎవరో చెప్పుకోండి..
ఇతర కంటెస్టెంట్స్ చూస్తున్నారు, కెమెరాలు ఉన్నాయని కూడా లేకుండా ఇద్దరూ ఘాడమైన రొమాన్స్ కురిపించారు. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. హౌస్లో ఉన్నంతసేపు ఒకరి చేయి మరొకరు వీడలేదు. హౌస్లోనే పెళ్లి చేసుకుందామని ప్రియాంక అన్నది. లేదు నువ్వు బయటకు వచ్చిన వెంటనే చేసుకుందామని శివ కుమార్ హామీ ఇచ్చాడు. బిగ్ బాస్ ముగిసి ఆరు నెలలు దాటిపోయింది. ప్రియాంక-శివ కుమార్ పెళ్లి మాట ఎత్తడం లేదు.
Also Read: Manchu Lakshmi: మంచు లక్ష్మికి మోహన్ బాబు చేసిన అన్యాయం ఏమిటీ… ఇన్నాళ్లు ఎందుకు దాచింది?
తాజాగా లివ్ ఇన్ రిలేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిసేలా రొమాంటిక్ ఫోటోలు షేర్ చేశారు. వీరిద్దరూ సహజీవనం చేయడం పై గతంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వివరణ ఇచ్చారు. పెళ్లి అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అందుకే ఆలస్యం అవుతుంది. డబ్బులు సమకూర్చుకున్నాక వివాహం చేసుకుంటాము. అలాగే మేము చెరొక ఇంట్లో ఉండటం వలన ఖర్చు అధికం అవుతుంది. అందుకే కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నామని వెల్లడించారు. మరోవైపు ప్రియాంక ఎలాంటి సీరియల్స్ చేయడం లేదు. శివ కుమార్ ఓ కొత్త సీరియల్ కి కమిట్ అయ్యాడు.