https://oktelugu.com/

Jr NTR : లక్ష్మి ప్రణతి బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన ఎన్టీయార్…

Jr NTR : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేనటువంటి గుర్తింపు కేవలం నందమూరి ఫ్యామిలీకి మాత్రమే ఉందని చెప్పాలి. నందమూరి తారక రామారావు గారు చేసిన సినిమాలు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచాయి.

Written By: , Updated On : March 26, 2025 / 08:51 AM IST
Jr NTR

Jr NTR

Follow us on

Jr NTR : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేనటువంటి గుర్తింపు కేవలం నందమూరి ఫ్యామిలీకి మాత్రమే ఉందని చెప్పాలి. నందమూరి తారక రామారావు గారు చేసిన సినిమాలు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచాయి. మరి ఇలాంటి సందర్భంలో ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా తన ఫ్యామిలీని సైతం ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా ఆయన తీవ్రమైన ప్రణాళికలు రూపొందించాడు…

నందమూరి ఫ్యామిలీ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR ) తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గత సంవత్సరం ఆయన చేసిన దేవర (Devara) సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసి పెట్టింది. మరి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఆయన దేవర సినిమాతో 500 కోట్ల కలెక్షన్లు రాబట్టి తనకంటూ ఒక స్టార్ డమ్ ను విస్తరించుకున్నాడు. మరి ఇప్పుడు దేవర సినిమాని జపాన్ లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన జపాన్ లోనే ఉన్నాడు. ఇక కుటుంబ సమేతంగా జపాన్ కి వెళ్లిన ఎన్టీఆర్ మంగళవారం రాత్రి తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేశాడు. ఇక అలాగే కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ‘అమ్మలు హ్యాపీ బర్త్ డే’ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.

Also Read : జపాన్ థియేటర్స్ లో ఎన్టీఆర్ మేనియా..గూస్ బంప్స్ రప్పించే వీడియో!

మొత్తానికైతే తన భార్య లక్ష్మీ ప్రణతి అంటే ఎన్టీఆర్ కు ఎంత ఇష్టమో ఈ ఒక్క పోస్ట్ ద్వారా తెలియజేశాడనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో జపాన్ లో కనక దేవర సినిమా సూపర్ సక్సెస్ అయితే మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటికే జపాన్ లో ప్రీమియర్స్ మొదలయ్యాయి.

కాబట్టి ఈ సినిమా అక్కడ పాజిటివ్ టాక్ ని సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుందనే ఒక దృఢ సంకల్పంతో అటు కొరటాల శివ, ఇటు ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద తను ఎక్కువ ఫోకస్ ని కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ సినిమా కోసమే అతను చాలా సన్నగా మారాడు. అతని కొత్త లుక్స్ కనుక మనం చూసినట్లయితే ఎన్టీఆర్ మరి ఇంతలా సన్నమైపోయాడు ఏంటి అని ఆశ్చర్య పోవాల్సిందే…

ఇక జపాన్ నుంచి వచ్చిన తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాని వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలపాలనే ఉద్దేశ్యంతో ప్రశాంత్ నీల్ తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది…

Also Read : చేతిలో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీ : ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో లోకేష్ కు తెలుసు*