Venkatesh
Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక సీనియర్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఆయన రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 300 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేశాడు. సీనియర్ హీరోలు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయిందనే చెప్పాలి. వెంకటేష్ లాంటి స్టార్ హీరో సైతం మరోసారి తన మార్కెట్ ను పెంచుకోవడమే కాకుండా ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసి చూపించాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తున్న వేళ ఇప్పుడు సీనియర్ స్టార్ డైరెక్టర్ అయిన వివి వినాయక్ తో ఆయన సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. వినాయక్ కి గత కొన్ని సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ అయితే దక్కడం లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే వెంకటేష్ ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : పాన్ ఇండియా డైరెక్టర్లతో సినిమా ప్లాన్ చేస్తున్న వెంకటేష్…
ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో వెంకటేష్ మనకు ఈ సినిమాలో కనిపించబోతున్నారట. ఒకప్పుడు వినాయక్ ఎలాంటి సినిమాలు చేశాడో మరోసారి అలాంటి ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందు లక్ష్మీ అనే సినిమా వచ్చింది.
ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఆ సినిమాను మించి ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద వెంకటేష్ భారీ కాన్ఫిడెంట్ తో ఉన్నాడట. మరి వినాయక్ చెప్పిన కథ అతనికి బాగా నచ్చిందని తొందరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కానీ వెంకటేష్ నుంచి మాత్రం ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.
కాబట్టి ఈ సినిమా ఉంటుందా లేదా అనే విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక వివి వినాయక్ చిరంజీవితో చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత ఆయనకు ఆశించిన మేరకు విజయాలైతే దక్కలేదు. ఆ సినిమా రీమేక్ గా వచ్చినప్పటికి చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటుతూ భారీ విజయాన్ని అందుకున్నాడు. మరి ఈ సినిమా తర్వాత వినాయక్ చేసిన వరుస సినిమాలు డిజాస్టర్ బాట పట్టాయి. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో బాలీవుడ్ లో చేసిన ఛత్రపతి సినిమా సైతం డిజాస్టర్ ను మూటగట్టుకుంది…
Also Read : విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ మూవీపై క్రేజీ న్యూస్… వర్క్ అవుట్ అయితే మరో బ్లాక్ బస్టర్!