Homeఆంధ్రప్రదేశ్‌Jagan Mohan Reddy: ఏకగ్రీవాలకు ఆద్యుడు జగన్.. నాటి వైసీపీ అరాచకం ఎలాంటిదంటే..

Jagan Mohan Reddy: ఏకగ్రీవాలకు ఆద్యుడు జగన్.. నాటి వైసీపీ అరాచకం ఎలాంటిదంటే..

Jagan Mohan Reddy:స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఏకగ్రీవాల మీద చర్చ నడుస్తోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఏకగ్రీవాలు పెరిగిపోయాయని వైసిపి వాదిస్తోంది. సొంత మీడియాలో అడ్డగోలుగా రాస్తోంది. ఇదే సమయంలో కూటమి నాయకులు తమ పరిపాలన కాలంలో.. వైసిపి పరిపాలన కాలంలో జరిగిన ఏకగ్రీవాలను గణాంకాలతో సహా బయటపెడుతున్నారు.. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కనీసం నామినేషన్లు కూడా వేయనీయలేదని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాదు, వైసిపి అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో […]

Jagan Mohan Reddy:స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఏకగ్రీవాల మీద చర్చ నడుస్తోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఏకగ్రీవాలు పెరిగిపోయాయని వైసిపి వాదిస్తోంది. సొంత మీడియాలో అడ్డగోలుగా రాస్తోంది. ఇదే సమయంలో కూటమి నాయకులు తమ పరిపాలన కాలంలో.. వైసిపి పరిపాలన కాలంలో జరిగిన ఏకగ్రీవాలను గణాంకాలతో సహా బయటపెడుతున్నారు.. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కనీసం నామినేషన్లు కూడా వేయనీయలేదని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాదు, వైసిపి అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్న తీరుకు సంబంధించిన వీడియోలను.. ఇతర ఆధారాలను టిడిపి నేతలు బయటపెడుతున్నారు. అసలు నామినేషన్లు వేయనీయడం లేదని వైసీపీ నేతలు విమర్శించడానికి టిడిపి నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

2021 సంవత్సరంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసిపి అరాచకాలకు పాల్పడిందని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. ఏకంగా 20.72 శాతం ఏకగ్రీవాలు చేయించుకున్నట్టు టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 24% వరకు ఎంపీటీసీ స్థానాలు.. 19 శాతం వరకు జెడ్పిటిసి స్థానాలను బలవంతంగా వైసిపి ఏకగ్రీవం చేసుకుందని టిడిపి నేతలు వివరిస్తున్నారు. 2014లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికలతో పోల్చి చూసుకుంటే 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల శాతం విపరీతంగా పెరిగిపోయిందని.. దీనికి వైసిపి అరాచకాలే కారణమని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. 2014లో పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పుడు ఒక్క శాతం స్థానంలో ఏకగ్రీవాలు జరిగాయని టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో రెండు శాతం మేర ఎంపీటీసీ స్థానాలు.. 0.09% మేర జెడ్పిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని టిడిపి నేతలు చెబుతున్నారు.

వైసిపి అధికారంలో ఉన్నప్పుడు కనీసం నామినేషన్లు కూడా వేసే అవకాశం లేకుండా చేశారని.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత.. స్వేచ్ఛాయుత విధానంలో ఎన్నికలు జరిగేందుకు రూపకల్పన జరుగుతుంటే.. క్షేత్రస్థాయిలో బలం లేకపోవడంతో వైసిపి ఇలాంటి విష ప్రచారం చేస్తుందని టిడిపి నేతలు అంటున్నారు. ఒకవేళ నామినేషన్లు వేయనీయకుండా ఉంటే వైసిపి నేతలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు. కక్షపూరితమైన విధానం తమది కాదని.. అందువల్లే ఏపీలో వైసిపి ఇంకా రాజకీయాలు చేయగలుగుతోందని టిడిపి నేతలు అంటున్నారు. అనవసరంగా విష ప్రచారం చేసి ప్రజల్లో చులకన కావద్దని టిడిపి నేతలు సూచిస్తున్నారు.. ఇప్పటికైనా ప్రజలకు మంచి చేసే పనులు చేపడితే బాగుంటుందని.. అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చివరికి ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper