Bigg Boss Buzzz Promo: ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ బజ్ కార్యక్రమం చాలా వినోదంగా సాగిందని… యూట్యూబ్ లో విడుదల చేసిన జెస్సీ బిగ్ బాస్ బజ్ ప్రోమో చూస్తున్న ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వగానే ముందుగా నిర్వహించే ఇంటర్వ్యూ బిగ్ బాస్ బజ్. అలా ఎలిమినేట్ అయిన అవ్వగానే ఇంటికి వెళ్లకుండా ఒక నలభై నిమిషాల ఇంటర్వ్యూ ఇస్తారు. అలా గత మూడు సీజన్ల నుండి నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ బజ్ కార్యక్రమం. మొదటి రెండు సీజన్ కి మాత్రం బిగ్ బాస్ బజ్ కార్యక్రమం నిర్వహించలేదు బిగ్ బాస్ నిర్వాహకులు. మూడో సీజన్ నుండి ఇప్పుడు జరిగే ఇదో సీజన్ వరకు బిగ్ బాస్ బజ్ కార్యక్రమం కొనసాగుతూ వస్తుంది.
ఇలా మూడో సీజన్ నుండి ఇప్పుడు ప్రసారమవుతున్న బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి తనీష్ (రెండో సీజన్ రన్నర్ అప్), సింగర్ రాహుల్ సింప్లిగంజ్ (మూడో సీజన్ విన్నర్), అరియనా గ్లోరీ (బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్) వ్యాఖ్యాతలుగా తమదైన స్టయిల్ లో అద్భుతం గా రాణిస్తున్నారు.
అప్పుడే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఖచ్చితంగా ఒకపాటి బాధ, కోపం ఉంటుంది. అలా ఎమోషన్స్ ని కాష్ చేసుకుని కంటెస్టెంట్స్ లో ఉన్న బాధ, కోపం చల్లారకముందే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు బిగ్ బాస్ నిర్వాహకులు. అటువంటు సమయం లో ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ మీద తమ అభిప్రాయాలని బయటపడతారు.
అయితే ఈ క్రమం లో జెస్సీ చాలా సరదాగా అరియనా తో ముచ్చటించాడు. మిస్టర్ మజ్ను అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ చాలా బాగా అనిపించిందని కామెంట్స్ బాక్స్ లో ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఈ నేపథ్యం లో జెస్సీ నేను ఆరు రోజులు ఒంటరిగా సీక్రెట్ రూమ్ లో ఉండలేకపోయానని చెప్పాడు అరియనా తో. చాలా చండాలంగా మాట్లాడుతున్నావ్ జెస్సీ అని అరియనా అంటే…. నువ్వు సోహెల్ ఇద్దరూ కలిసి సీక్రెట్ రూమ్ లో ఉందాలేదా అని ఎదురు ప్రశ్న వేస్తాడు. అబ్బా జెస్సీ… నా సీక్రెట్స్ అన్ని బయట పెట్టకు అంటూ సరదాగా వారించింది. ఇలాంటి కూల్ ప్రోమో ని ఎప్పుడు చూడలేదు అంటూ ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.