Homeఎంటర్టైన్మెంట్Actor Surya: జై భీమ్ పార్వతి అమ్మాళ్ కు అండగా హీరో సూర్య... ఏం చేశాడంటే...

Actor Surya: జై భీమ్ పార్వతి అమ్మాళ్ కు అండగా హీరో సూర్య… ఏం చేశాడంటే ?

Actor Surya: ప్రముఖ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. తమిళంతో పాటు తెలుగులో కూడా తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సూర్య. ఒక పక్క కమర్షియల్ సినిమాలతో పాటు మరో పక్క కథ బలం ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ” జై  భీమ్ ” అనే సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని దక్కించుకున్నాడు.  అన్యాయంగా జైలుపాలైన భర్తను కాపాడుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటం నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.  అందులో చంద్రూ అనే అడ్వకేట్ పాత్రలో సూర్య జీవించేశారు.

actor surya donates 10 lakh rupees to jai bhima real character parvathi ammal

ఈ సినిమా పార్వతి అమ్మాళ్ అనే మహిళ జీవితంపై తెరకెక్కిన విషయం తెలిసిందే స్ఫూర్తి. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండగా… రాఘవ లారెన్స్ ఆమెకు సొంత ఇల్లు కటిస్తానని మాట ఇచ్చారు. అయితే తాజాగా హీరో సూర్య సైతం పార్వతి అమ్మాళ్‌కు అండగా నిలిచాడు. తన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసి… మొత్తంపై నెల నెలా వచ్చే వడ్డీ పార్వతి అమ్మాళ్‌కు చేరేలా చేశాడు సూర్య. అంతే గాక తన తదనంతరం ఆమె పిల్లలకు ఈ వడ్డీ అందజేస్తామని సూర్య తెలిపారు. ఇప్పటికే అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య ఎంతో మందికి సేవలు చేస్తున్నాడు. అంతే గాక జై భీమ్‌ చిత్రం స్ఫూర్తితో గిరిజనుల సంక్షేమం కోసం కూడా సూర్య కోటీ రూపాయల విరాళాన్ని సీఎం సమక్షంలో అందజేయడం తెలిసిందే. ఇలా సూర్య రీల్‌ హీరోగా మాత్రమే కాకుండా రియల్‌ హీరో అని కూడా అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular