RRR: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతోన్న సినిమా ఆర్ఆర్ఆర్. పీరియాడికల్ స్టోరీ నేపథ్యంలో రూపొందిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అలియా భట్, హాలీవుడ్ హీరోయిన్ ఓలీవియా మోరిస్‌లు హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక కీలక పాత్రలో అజయ్‌దేవగణ్ కూడా నటిస్తున్నారు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై అంచనాలు రేకెత్తిస్తున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. వచ్చే ఏడాది జనవరు 7న విడుదలకు సిద్ధమైంది.
కాగా, అదే సమయానికి సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న గంగూబాయి కథియావాడి సినిమా కూడా థియేటర్లలోకి రానుంది. అజయ్ దేవ్‌గణ్, అలియా భట్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిచంచారు. ఈ సినిమాను జనవరి 6న విడుదల చేయాలని ఇది వరకే నిర్ణయించింది చిత్రబృందం. హీందీతో పాటు, తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా పోటీలో ఉండటంతో దర్శక నిర్మాతలు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఈ రెండు సినిమాల మధ్య విడుదలకు ఒక రోజు గ్యాప్ మాత్రమే ఉంది. ఇటువంటి సమయంలో విడుదల చేస్తే కలెక్షన్ల పరంగా తీవ్ర ప్రభావం పడుతుంది.
అందుకే గంగూబాయి చిత్రబృందం కాస్త వెనక్కి తగ్గింది. జనవరి 7న కాకుండా.. ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. దీంతో ఆర్ఆర్ఆర్కు బాలీవుడ్‌లోనూ రూట్ క్లియర్ అయినట్లైంది. వాస్తవ ఘటనల ఆధారంగా గంగూబాయ్ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More