Homeఎంటర్టైన్మెంట్Jayam Ravi wife demands alimony: నెలకు 40 లక్షలు ఇస్తేనే విడాకులు ఇస్తానంటూ స్టార్...

Jayam Ravi wife demands alimony: నెలకు 40 లక్షలు ఇస్తేనే విడాకులు ఇస్తానంటూ స్టార్ హీరో టార్చర్ పెడుతున్న సతీమణి..

Jayam Ravi wife demands alimony: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో జయం రవి విడాకులకు సంబంధించిన విషయం పై ఏ రేంజ్ లో చర్చలు నడుస్తున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం. దశాబ్దాల నుండి తమిళనాడు లో టాప్ హీరో గా కొనసాగుతున్న జయం రవి , తన భార్య ఆర్తి పెట్టే మానసిక క్షోభ ని తట్టుకోలేక మీడియా ముందుకొచ్చి బాధ పడడం ఆయన అభిమానులకు మాత్రమే కాదు , ఇతరులకు […]

Jayam Ravi wife demands alimony: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో జయం రవి విడాకులకు సంబంధించిన విషయం పై ఏ రేంజ్ లో చర్చలు నడుస్తున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం. దశాబ్దాల నుండి తమిళనాడు లో టాప్ హీరో గా కొనసాగుతున్న జయం రవి , తన భార్య ఆర్తి పెట్టే మానసిక క్షోభ ని తట్టుకోలేక మీడియా ముందుకొచ్చి బాధ పడడం ఆయన అభిమానులకు మాత్రమే కాదు , ఇతరులకు కూడా చాలా బాధగా అనిపించింది. మనకే ఇలా ఉంటే , ఇక జయం రవి పిల్లలకు తన తండ్రి అలా మీడియా ముందుకొచ్చి ఏడుస్తుంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇద్దరు పిల్లలకు జయం రవి అంటే చాలా ఇష్టం , జయం రవి కి కూడా తన పిల్లలు అంటే ప్రాణం. కానీ ఆర్తి వీళ్ళని కలవనివ్వకుండా చేస్తుంది, అందుకు బాడీ గార్డ్స్ ని కూడా పెట్టుకోవడం గమనార్హం.

ఇవన్నీ మీడియా ముందు చెప్పుకొని బోరుమని ఏడ్చాడు జయం రవి. అంతే కాదు , ఆమెని పెళ్లి చేసుకున్న రోజు నుండి నాకంటూ ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ లేదని, నా భార్య ఆర్తి తో కలిపి జాయింట్ అకౌంట్ మాత్రమే ఉందని , ఒక్క పైసా తీసుకోవాలన్నా ఆమె అనుమతి ఉండాలని , పొరపాటున ఆమెకు తెలియకుండా చిన్న అమౌంట్ డ్రా చేసి తీసుకున్నా పెద్ద గొడవ చేస్తుందని ఆయన మీడియా ముందుకొచ్చి చెప్పుకున్న మాటలు అందరినీ కదిలించేశాయి. ఆర్తి తో విడాకులు తీసుకునే వరకు నేను సినిమాలు చెయ్యనని , చేసిన సినిమాలను కూడా నిలిపిస్తున్నాని జయం రవి సంచలన నిర్ణయం కూడా తీసుకున్నాడు. అయితే ఈ అంశం ఇప్పుడు కోర్టు లో ఉంది. విడాకులు ఇవ్వాలంటే ఆర్తి పెట్టిన కండీషన్స్ ని చూస్తే ఎవరికైనా రక్తం మరిగిపోవాల్సిందే.

విడాకులు ఇవ్వాలంటే , జీవితాంతం జయం రవి నాకు నెలకు 40 లక్షల రూపాయిలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తుంది. నెలకు 40 లక్షలు అంటే సంవత్సరానికి 4.8 కోట్లు రూపాయిలు. జయం రవి ఒక్క సినిమా చేయడానికి ఏడాది సమయం తీసుకుంటాడు , ఆయన రెమ్యూనరేషన్ 5 నుండి 6 కోట్ల రూపాయలకు మించి కూడా ఉండదు , ఒక్కోసారి ఆయన ఏడాది మొత్తం సినిమాలు చేయకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి . ఇలా నెలకు 40 లక్షల రూపాయిలు అంటే , జయం రవి ఆస్తులు అమ్ముకున్నా ఆమెని మైంటైన్ చేయడానికి సరిపోదు , పాపం నీ బాధ పగోడికి కూడా రాకూడదు అంటూ సోషల్ మీడియా లో జయం రవి పై జాలి చూపిస్తున్నారు నెటిజెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper