Homeక్రీడలుక్రికెట్‌Shubman Gill IND vs AFG: కొత్త కెప్టెన్ అన్నారు.. గిల్ వైపే మొగ్గు చూపించారు.....

Shubman Gill IND vs AFG: కొత్త కెప్టెన్ అన్నారు.. గిల్ వైపే మొగ్గు చూపించారు.. ఏం జరిగి ఉంటుంది..

Shubman Gill IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఒక టెస్ట్, 3 వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మన దేశం వేదికగా జూన్ నెలలో ఈ సిరీస్ లు జరుగుతాయి. టెస్ట్, వన్డేలకు టీమిండియా సారధిగా గిల్ వ్యవహరిస్తాడు.

గిల్ సారధిగా ఉంటాడని కోచ్ అజిత్ చెప్పడం స్పోర్ట్స్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే టీమిండియా వన్డే సారధిగా గిల్ ను తప్పించి అయ్యర్ ను నియమిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే వన్డేలలో గిల్ నాయకత్వంలో టీమిండియా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. దీనికి తోడు గిల్ వ్యక్తిగత ప్రదర్శన కూడా అంత గొప్పగా లేదు. టెస్టులలో కూడా గిల్ అంతంతమాత్రంగానే ఆడుతున్నాడు. దీంతో అతని స్థానంలో అయ్యర్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది.

సారధి మార్పుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ.. పరోక్షంగా అదేవిధమైన సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ ఐపీఎల్ ప్రారంభంలో పంజాబ్ జట్టు సారధిగా ఉన్న అయ్యర్.. జట్టుకు వరుస విజయాలు సాధించి పెట్టాడు. ఆ తర్వాత వరుస ఓటములతో పంజాబ్ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం లేకుండా పోయింది. వరుస విజయాలు సాధించిన ఆ జట్టు.. ఇప్పుడు వరుస ఓటములతో ఇబ్బంది పడుతోంది. చివరికి ప్లే ఆఫ్ వెళ్లడానికి ఇతర జట్ల గెలుపుల మీద ఆధార పడాల్సిన దుస్థితి నెలకొంది.

పంజాబ్ జట్టును సమర్థవంతంగా నడిపించలేకపోయాడనే కారణంతో అయ్యర్ ను సారధిగా ఎంపిక చేయలేదని తెలుస్తోంది. అందువల్లే అతనికి వన్డే జట్టులో అవకాశం కల్పించారు. ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో వన్డే సిరీస్ లో ఆడుతున్నప్పుడు అయ్యర్ గాయపడ్డాడు. చాలా రోజుల వరకు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఐపీఎల్ లో సత్తా చూపిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగే సిరీస్లో కాకున్నా.. వచ్చే సిరీస్ లో నైనా అతడికి సారధిగా అవకాశం లభించవచ్చని స్పోర్ట్స్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper