https://oktelugu.com/

నెట్‌ఫ్లిక్స్‌లో జాన్వీ కపూర్ కొత్త సినిమా.. రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

‘ధఢక్’ మూవీతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది దివంగత అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకున్న జాన్వీ కొంత గ్యాప్‌ తర్వాత ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’లో నటించింది. ఆపై, ‘అంగ్రేజి మీడియం’లో గెస్ట్‌ రోల్‌ చేసింది. కానీ, ఇప్పుడు వేగం పెంచింది. వరుసగా సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన ‘గుంజన్ సక్సేనా’ రూహి అఫ్జానా’ చిత్రీకరణ పూర్తవగా, ‘ దోస్తానా 2’ సినిమా సెట్స్‌పై ఉంది. తాను ప్రధాన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 16, 2020 7:57 pm
    Follow us on


    ‘ధఢక్’ మూవీతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది దివంగత అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకున్న జాన్వీ కొంత గ్యాప్‌ తర్వాత ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’లో నటించింది. ఆపై, ‘అంగ్రేజి మీడియం’లో గెస్ట్‌ రోల్‌ చేసింది. కానీ, ఇప్పుడు వేగం పెంచింది. వరుసగా సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన ‘గుంజన్ సక్సేనా’ రూహి అఫ్జానా’ చిత్రీకరణ పూర్తవగా, ‘ దోస్తానా 2’ సినిమా సెట్స్‌పై ఉంది. తాను ప్రధాన పాత్రలో నటించి ‘గుంజన్ సక్సేనా.. ది కార్గిల్‌ గాళ్‌’పై ఆమె భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ మూవీ తన కెరీర్కు ప్లస్ అవుందన్న నమ్మకంతో ఉంది. ఎందుకంటే ఫస్ట్‌ ఇండియన్‌ ఫీమేల్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. తన ధైర్య సాహసాలతో 1999 కార్గిల్‌ యుద్ధం సమయంలో గాయాలపాలైన సైనికులను విమానంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించిన మ‌హిళా పైల‌ట్ గుంజ‌న్ సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. దీనికి మెచ్చిన ప్రభుత్వం ఆమెకు శౌర్యవీరచక్ర అవార్డు ఇచ్చింది. ఈ సినిమా కోసం జాన్వీ, ఫ్లైట్ నడపడం సహా పలు ఇతర యుద్ధ విద్యలు కూడా నేర్చుకుంది.

    ఛాన్స్ లు కోసం హాట్ నెస్ కే యాంకర్ ఫిక్స్ !

    షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. చిత్రబృందం తొలుత మార్చి 13న విడుదల చేయాలనుకుంది. ఆ తర్వాత ఏప్రిల్‌ 24కు వాయిదా వేశారు. కరోనా వైరస్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో విడుదల సాధ్యపడలేదు. దాంతో, దీన్ని ఓటీటీలో రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. 70 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌కు డిజిటల్‌ రైట్స్‌ ఇచ్చింది. దాంతో, స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 12న ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌తో పాటు జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ‘ఫస్ట్‌ ఇండియన్‌ ఫీమేల్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావటం చాలా గర్వంగా ఉంది. ఆమె జీవితం నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది. మీకు కూడా స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నా. గుంజన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గాళ్‌’ ఆగస్టు 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుంది’ అని పేర్కొన్నది. అలాగే, ఈ సినిమాకు సంబంధించిన మూడు మోషన్‌ పోస్టర్లను జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ధర్మ ప్రొడక్షన్స్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శరణ్‌ శర్మ దర్శకత్వం వహించారు.