https://oktelugu.com/

చిరు రేంజ్‌కు రెహమాన్‌ సరిపోతాడా?

మోహన్‌ లాల్‌ హీరోగా వచ్చిన మలయాళ మూవీ ‘లూసిఫర్’ ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీ తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారు. మోహన్‌ లాల్‌ పాత్రను చిరు పోషించనుండగా… ‘సాహో’ ఫేమ్‌ సుజిత్‌ దర్శకత్వం వహిస్తారు. కొరటాల శివతో చేస్తున్న ‘ఆచార్య’ పూర్తవగానే ఈ మూవీని సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలని చిరు భావిస్తున్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ అయినప్పటి నుంచి రోజుకో వార్త వస్తోంది. తొలుత ఈ మూవీలో విజయ్‌ దేవరకొండ నటిస్తారని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 16, 2020 8:07 pm
    Follow us on


    మోహన్‌ లాల్‌ హీరోగా వచ్చిన మలయాళ మూవీ ‘లూసిఫర్’ ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీ తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారు. మోహన్‌ లాల్‌ పాత్రను చిరు పోషించనుండగా… ‘సాహో’ ఫేమ్‌ సుజిత్‌ దర్శకత్వం వహిస్తారు. కొరటాల శివతో చేస్తున్న ‘ఆచార్య’ పూర్తవగానే ఈ మూవీని సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలని చిరు భావిస్తున్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ అయినప్పటి నుంచి రోజుకో వార్త వస్తోంది. తొలుత ఈ మూవీలో విజయ్‌ దేవరకొండ నటిస్తారని వార్త రాగా.. అది నిజం కాదని తేలింది. ఈ మూవీలో హీరో.. అంటే చిరు సోదరి పాత్ర విషయంలోనూ అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఆ పాత్ర కోసం విజయశాంతి, సుహాసిని, ఖుష్బూ పేర్లు వినిపించాయి. కానీ, ఎవరిని ఎంచుకున్నారో ఇంకా సస్పెన్సే.

    ఇక ఇప్పుడు ఈ మూవీ విలన్‌ విషయంలో కూడా కూడా కన్ఫ్యూజన్‌ కొనసాగుతోంది. మాతృకలో విలన్‌గా నటించిన హిందీ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌నే తీసుకోవాలని చిత్ర బృందం భావించింది. కానీ, డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక వివేక్‌ ఈ ఆఫర్ను కాదన్నాడు. దాంతో, రెహమాన్‌ పేరు తెరపైకి వచ్చింది. తెలుగులో అతనికి మంచి పేరుంది. సింహ మూవీలో బాలకృష్ణ బావగా నటించిన ఆయన తర్వాత చాలా చిత్రాలు చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌ గా కూడా మెప్పించి తెలుగు ఆడియన్స్‌కు చేరువయ్యాడు. మంచి హైట్‌, పర్సనాలిటీ ఉండడంతో చక్కగా సరిపోతాడన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, చిరు మూవీలో విలన్‌ అంటే ఆయన లెవెల్‌ను మ్యాచ్‌ చేయాలని, అందుకు పేరున్న నటుడే కావాలని పలువురు కామెంట్‌ చేస్తున్నారు. రెహమాన్‌ మంచి యాక్టరే అయినా చిరును సవాల్‌ చేయగలిగే స్టామినా అతనిలో లేదని అంటున్నారు. అయితే, అసలు విలన్‌ పాత్రధారిని ఖరారు చేయకుండానే ఇలా మాట్లాడడం సరికాదని మరికొందరు వాదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా లూసిఫర్ విలన్‌ ఎవరనేదానిపై సస్పెన్స్‌ అలానే ఉంది. మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ ఆగిపోయిన ‘ఆచార్య’ విషయంలోనూ అనేక వార్తలు, పుకార్లు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

    ‘ఆచార్య’లో తమన్నా ఐటమ్‌ సాంగ్!

    ఈ మూవీని ప్రొడ్యూస్‌ చేస్తున్న రామ్‌ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తాడని చిరు ఇది వరకే ప్రకటించాడు. పాత్ర నిడివి పెద్దదే కావడంతో చెర్రీకి హీరోయిన్‌ కూడా ఉంటుందట. ఆ పాత్ర కోసం కియారా, కీర్తి సురేశ్‌లో ఒకరిని తీసుకుంటారని టాక్‌ నడిచింది. కాదు కాదు అసలు చెర్రీ నటించడమే లేదు ఆ పాత్రను రానా చేస్తాడని తాజా రూమర్స్‌ వస్తున్నాయి. అలాగే, మూవీలో ఓ ఐటమ్‌ సాంగ్‌ ఉంటుందని, తమన్నా అందులో స్టెప్పులేస్తుందన్న వార్త కూడా హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో చిత్ర బృందమే క్లారిటీ ఇవ్వాలి.