ఈషా రెబ్బ, కార్తికేయతో కలిసి చిరు గొప్ప సందేశం!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల్లో అవగాహన కల్పించడంలో మెగాస్టార్ చిరంజీవి అందరికంటే ముందున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, ఇతర స్టార్లతో కలిసి ఇప్పటికే ఓ షార్ట్‌ యాక్ట్‌ చేశారు. ఓ వీడియో సాంగ్‌లో కూడా పాల్గొని ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుందని, మరింత జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ‌ చిరంజీవి తన దైన శైలిలో మరో వీడియో సందేశం ఇచ్చారు. హీరో […]

Written By: Neelambaram, Updated On : July 18, 2020 8:25 pm
Follow us on


ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల్లో అవగాహన కల్పించడంలో మెగాస్టార్ చిరంజీవి అందరికంటే ముందున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, ఇతర స్టార్లతో కలిసి ఇప్పటికే ఓ షార్ట్‌ యాక్ట్‌ చేశారు. ఓ వీడియో సాంగ్‌లో కూడా పాల్గొని ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుందని, మరింత జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ‌ చిరంజీవి తన దైన శైలిలో మరో వీడియో సందేశం ఇచ్చారు. హీరో కార్తీకేయ, నటి ఈషా రెబ్బాతో వేర్వేరుగా చేసిన రెండు వీడియోలను ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆ వీడియోల్లో సందేశం ఇచ్చారు. ‘కరోనా కట్టడికి మాస్కు తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్‌’ అని విజ్ఞప్తి చేశారు. ఈషా రెబ్బతో వీడియోలో.. ఆమె పెదాలకు లిప్‌ స్టిప్‌ పెట్టుకొని అద్దంలో చూసుకొని నవ్వుతుండగా… ‘చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్‌ ధరించాలి’ అంటూ ఇషాకు మాస్క్‌ ఇస్తూ సందేశం ఇచ్చారు. మరో వీడియో మీసాలు నిమురు కంటున్న కార్తికేయతో ‘మీసం మెలేయడం వీరత్వం ఒకప్పుడు కానీ ఇప్పుడు మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం’ అని అన్నారు.

ప్రభాస్ ఒక్కడే దిక్కు.. మరి ఒప్పిస్తాడా?

కరోనా మరింత విజృంభిస్తుందని, పరిస్థితి చాలా దారుణంగా మారుతుందని ఈ నెల 13న డబ్ల్యూహెచ్‌వో చీఫ్ జారీ చేసిన హెచ్చరికను చిరు గుర్తు చేశారు. కరోనా వ్యాప్తి చైన్‌ను తెంపేందుకు ప్రతి ఒక్కరూ తమ ప్రయత్నం చేయాలని, అంతా కలిసి మహమ్మారిని అంతం చేయాలని ఆయన పేర్కన్నారని చెప్పారు. అందుకే ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని చిరు కోరారు. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుని, వీలైనప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలని, కచ్చితంగా మాస్కులు ధరించి, సాంఘీక దూరం పాటించండి అన్నారు. వీడియోలో నటించిన ఈషా రెబ్బ, కార్తికేయ చిరు థ్యాంక్స్ చెప్పారు. ‘ఆలోచన పంచుకోగనే ముందుకొచ్చి మీకు నా ధన్యవాదాలు. సమాజం పట్ల మీ నిబద్దతను అభినందిస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు.

https://twitter.com/KChiruTweets/status/1283619758844243968