శ్రీదేవి. అందాల తార. అతిలోక సుందరి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలోనే కాదు బాలీవుడ్‌నూ ఒక ఊపు ఊపిన దిగ్గజ హీరోయిన్. శ్రీదేవి చనిపోయి రెండేళ్లు అవుతున్నా.. ఆమెను ఎవ్వరూ మరచిపోవడం లేదు. బతికుండగానే తన నటవారసురాలిగా పెద్ద కూతురు జాన్వీ కపూర్ (జాహ్నవీ) ను వెండితెరకు పరిచయం చేసిందామె. తాను ఎదిగిన తెలుగులోనే జాన్వీ ఇంట్రడ్యూస్ చేస్తుందని అనుకున్నా.. బాలీవుడ్ మూవీ ‘ధడక్’తో పరిచయం చేసింది. ఆ తర్వాత కూడా జాన్వీ కపూర్‌ను తెలుగు తెరకు పరిచయం చేయాలని ఇప్పటికే చాలా మంది దర్శక, నిర్మాతలు పలు ప్రయత్నాలు చేశారు.
అలాగే ఫలానా హీరోతో జాన్వీ నటించబోతోందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. చిరంజీవి, శ్రీదేవి బ్లాక్‌బస్టర్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ని రామ్‌చరణ్, జాన్వీతో రీమేక్ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ, ఇవేవీ వర్కౌట్ కాలేదు. ఈలోపు జాన్వీ హిందీలో మూడు, నాలుగు సినిమాలకు సైన్ చేసి బిజీగా మారిపోయింది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘గుంజాన్ సక్సేనా’ వచ్చే నెలలో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోంది. అయితే, మరో మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండగా.. ఇంకో మూవీ సెట్స్‌పై ఉంది. ఇవన్నీ హిందీ మూవీసే.
Also Read: రెండో ‘బిచ్చగాడు’ వస్తున్నాడు..
తాజా సమాచారం మేరకు ఆమె తెలుగులో అడుగుపెట్టబోతోందట. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందే పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ నటించనుందట. ఇటీవలే బోనీకపూర్, జాన్వీకి దర్శకుడు త్రివిక్రమ్ కథ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కథ వారికి బాగా నచ్చిందని సమాచారం. ఎలాగూ పాన్ ఇండియా మూవీ, పైగా ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో తెలుగులో జాన్వీ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా ఉంటుందని భావించిన బోనీ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ టాక్. అదే టైమ్‌లో ఇప్పుడు తెలుగు సినిమాల పరిధి చాలా పెరిగింది. బోనీ కపూర్ కూడా పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’కు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.
Also Read: దీపికతో కాదు కియారాతో ప్రభాస్ రొమాన్స్!
తెలుగు పరిశ్రమలో పలువురు ప్రముఖులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ఇప్పుడిప్పుడే స్టార్డమ్ తెచ్చుకుంటున్న జాన్వీని తెలుగులో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుటుందని ఫిక్సయ్యారట. కాగా, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందబోయే ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీకి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.