https://oktelugu.com/

కేంద్రం డబ్బు.. కేసీఆర్ పేరు?

సామాన్యులకు ఎంత లబ్ధి చేకూరిందనేదే ముఖ్యం.. ఆ డబ్బు కేంద్రం ఇచ్చిందా? రాష్ట్రం సమకూర్చిందా అన్న వివరాలు అనవసరం. తమను ప్రభుత్వం ఆదుకుందా? ఏ ప్రభుత్వం ఆదుకుంది? ఎవరికి ఓటేయాలన్నదే చూస్తారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు హైజాక్ చేసి తమ పథకాలుగా మార్చేసి పేదలకు పంచేస్తున్నాయి. కేంద్రం డబ్బు.. రాష్ట్ర ప్రభుత్వాలకు పేరు వస్తుంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పథకాలను చాలా తెలివిగా వాడేస్తుంటారనే ప్రచారం […]

Written By:
  • NARESH
  • , Updated On : July 19, 2020 / 06:10 PM IST
    Follow us on


    సామాన్యులకు ఎంత లబ్ధి చేకూరిందనేదే ముఖ్యం.. ఆ డబ్బు కేంద్రం ఇచ్చిందా? రాష్ట్రం సమకూర్చిందా అన్న వివరాలు అనవసరం. తమను ప్రభుత్వం ఆదుకుందా? ఏ ప్రభుత్వం ఆదుకుంది? ఎవరికి ఓటేయాలన్నదే చూస్తారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు హైజాక్ చేసి తమ పథకాలుగా మార్చేసి పేదలకు పంచేస్తున్నాయి. కేంద్రం డబ్బు.. రాష్ట్ర ప్రభుత్వాలకు పేరు వస్తుంటుంది.

    తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పథకాలను చాలా తెలివిగా వాడేస్తుంటారనే ప్రచారం ఉంది. మూడో కంటికి తెలియకుండా నిధులను చాకచక్యంగా తన సొంత టీఆర్ఎస్ ప్రభుత్వ పథకంగా మలిచేస్తాడని అంటుంటారు.

    ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం పలు టీఆర్ఎస్ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందంటూ ఆధారాలు కూడా చూపించి ఎండగట్టారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

    Also Read: కేసీఆర్ ను ఇరుకునపెడుతున్న మంత్రులు..!

    సాధారణంగా మొదటి నుంచి కేసీఆర్ తన ప్రభుత్వ పథకాలకు ఏ రాజకీయ నాయకుడు, గొప్పగొప్ప వాళ్ల పేర్లు పెట్టడానికి ఇష్టపడేవారు కాదు. ఆయన పథకాలు అన్ని జనంలోంచి వచ్చేవిగానే ఉండేవి. లేదంటే దేవుళ్లు, దేవతల పేర్లు పెడతారు. కానీ కొన్ని రోజులుగా ఆ ట్రాక్ మార్చేశారు. బాలింతలకు ఇచ్చే కిట్స్ కు కేసీఆర్ కిట్ గా నామకరణం చేశారు.

    నిజానికి ప్రతీ పథకానికి ఇందిర, రాజీవ్ వంటి దివంగతుల పేర్లను కాంగ్రెస్ పార్టీ బాగా పెట్టేది. అదో కుటుంబ పార్టీగా ముద్ర పడింది. ఇప్పుడు కేసీఆర్ మాత్రం మెల్లిగా ఆ దారిలోకి వస్తున్నారు.

    ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున పేదలకు ఇళ్లను కట్టించి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మంత్రి కేటీఆర్ ఈ ఇళ్లను ప్రారంభించారు. ఆ జిల్లా కలెక్టర్ దీనికి ‘కేసీఆర్ కాలనీ’గా నామకరణం చేశారు.

    Also Read: వలసలతో ఏపీకి పెరగనున్న కరోనా ముప్పు..!

    అయితే ఇందులో అసలు విషయం ఏంటంటే ఈ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిసింది. కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఈ నిధులను ఇచ్చిందని.. దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఇల్లను నిర్మించాలనే ప్రతిష్టాత్మక పథకంలో ఇవి కట్టారని తెలిసింది.

    అయితే మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం మాత్రం కేంద్రం నిధులతో కట్టిన ఈ కాలనీకి కేసీఆర్ పేరు పెట్టడం విశేషం. దీంతో సొమ్ము కేంద్రానికి.. సోకు కేసీఆర్ ది అని బీజేపీ నేతలు ఈసడించుకుంటున్నారు.