నిమ్మగడ్డ కేసులో అనేక రకాల ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విషయం ఏప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టకుండా చేసేందుకు ప్రభుత్వం, ఎలాగైనా బాధ్యతలు తీసుకోవాలని రమేష్ కుమార్ పట్టుదలతో ఉండటంతో ఈ కథలో ట్విస్టులకు అంతు లేకుండా పోతుంది. తాజాగా నిమ్మగడ్డ కేసు విషయంలో హై కోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో మరో పిటీషన్ ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు నిమ్మగడ్డ ను ఎన్నికల కమిషనర్ ప్రభుత్వం నియమించకపోవడాన్ని గత శుక్రవారం జరిగిన విచారణలో తప్పుబట్టింది. గవర్నర్ ను కలవమని నిమ్మగడ్డకు సూచించింది.
Also Read: జగన్ కు మరో లేఖ రాసిన రామకృష్ణంరాజు..
హై కోర్టు ఆదేశాలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ పొందారు. ఈ సెల 20 తేదీ సోమవారం ఉదయం 11.30 గంటలకు కలిసేందుకు గవర్నర్ అవకాశం ఇచ్చారు. నిమ్మగడ్డ గవర్నర్ ను కలిసి హై కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషనర్ గా తనను నియమించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందని తెలియజేసి గవర్నర్ జోక్యాన్నికోరనున్నారు. దీంతో గవర్నర్ హై కోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నిక కమిషనర్ గా నియమించాలని ప్రభుత్వానికి సూచించే అవకాశం ఉంది. గవర్నర్ సూచన చేస్తే తప్పని సరిగా పాటించాల్సి వస్తుందని భావించిన జగన్ ప్రభుత్వం ఈ సమస్య లేకుండా సుప్రీం కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసింది.
Also Read: చంద్రబాబును ఎన్టీఆర్ తో కొడుతున్న జగన్
హై కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టులో గతంలో ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ విచారణలో సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హై కోర్టు తీర్పు సమంజసంగానే ఉందని ఈ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడవద్దని ప్రభుత్వానికి సూచించింది. అప్పటి పిటీషన్ పై విచారణ ఇంకా పూర్తి కాలేదు. మరోవైపు ప్రభుత్వం మరో పిటీషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సుప్రీం కోర్టు ఈ పిటీషన్ విచారించిన అనంరతం ఈ కేసులో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.